మీ సేవింగ్ అకౌంట్‌లో డబ్బులున్నాయా.? ఇలా చేస్తే నెలకు రూ. 7 వేలు మీ సొంతం
Post office: ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి రక్షణతో పాటు మంచి రిటర్న్స్ రావాలని అందరూ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ ఒక మంచి పథకాన్ని అందిస్తోంది. ఇంతకీ ఆ పథకం ఏంటి.? లాభాలు ఏంటంటే..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
60 ఏళ్లు దాటినవారి కోసం తీసుకొచ్చిందే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). త్రైమాసికానికి వడ్డీ రేటు 8.2% గా ఉంటుంది. ఇది బ్యాంకుల కంటే ఎక్కువ ఆదాయం అందించే పెట్టుబడి. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000, గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
త్రైమాసికానికి ఖాతాలోకి డబ్బు
ప్రస్తుతం (2025-26 రెండో త్రైమాసికం) SCSS వడ్డీ రేటు 8.2%గా ఉంది. ఈ వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖాతాలో జమ అవుతుంది. ఈ వ్యవస్థ సీనియర్లకు రెగ్యులర్ ఆదాయంగా ఉపయోగపడుతుంది.
రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే..
ఉదాహరణకు ఈ పథకంలో మీరు రూ. 10 లక్షల పెట్టుబడి పెట్టారని అనుకుందాం. దీనికి సంవత్సరానికి రూ. 82,000 వడ్డీ లభిస్తుంది. త్రైమాసికానికి లభించే వడ్డీ రూ. 20,500. దీంతో నెలకు సగటును మీరు సుమారు రూ. 6,833 పొందొచ్చన్నమాట.అంటే, SCSSలో రూ. 10 లక్షలు పెట్టిన సీనియర్ సిటిజన్‌కు నెలకు సుమారు రూ. 6,800 ఆదాయం వస్తుంది.
ఆదాయంపై పన్ను ప్రయోజనం
SCSS పెట్టుబడికి సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. వడ్డీపై పన్ను వర్తించినా, అధిక వడ్డీ రేటు కారణంగా నికర లాభం తగ్గదు. రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోరేవారికి ఈ స్కీమ్ మంచి భరోసాగా చెప్పొచ్చు.
మెచ్యూరిటీ, ముందస్తు ఉపసంహరణ
పథకం కాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది. అవసరమైతే మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఒక సంవత్సరం ముందు డబ్బు తీసుకుంటే వడ్డీ లాభం ఉండదు.
1–2 సంవత్సరాల మధ్య ఉపసంహరణలకు 1.5% జరిమానా.
2–5 సంవత్సరాల మధ్య ఉపసంహరణలకు 1% జరిమానా.
భార్యాభర్తలు జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు.

