MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price 2026: వచ్చే ఏడాది బంగారం ధర లక్షన్నర దాటే అవకాశం, అంచనా వేస్తున్న అమెరికన్ బ్యాంకు

Gold Price 2026: వచ్చే ఏడాది బంగారం ధర లక్షన్నర దాటే అవకాశం, అంచనా వేస్తున్న అమెరికన్ బ్యాంకు

Gold Price 2026: బంగారం ధరలు వచ్చే ఏడాది తగ్గుతాయని ఎంతో మంది వేచి ఉన్నారు. కానీ ఒక టాప్ అమెరికన్ బ్యాంకు మాత్రం బంగారం పదిగ్రాముల ధర మరింత పెరిగిపోతుందని అంచనా వేసి చెబుతోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 26 2025, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వచ్చే ఏడాది బంగారం ధరలు ఇవే
Image Credit : Pixabay

వచ్చే ఏడాది బంగారం ధరలు ఇవే

బంగారానికి డిమాండ్ పెరిగిపోతోంది. దానికి తగ్గట్టే ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే వచ్చే ఏడాది మాత్రం ధరలు తగ్గుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అమెరికాకు చెందిన పెద్ద బ్యాంకు మాత్రం వచ్చే ఏడాది బ్యాంకు ధరలు మరింతగా పెరుగుతాయని అంచనా వేసి చెప్పింది. ఆ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇది చెబుతున్న ప్రకారం 2026 నాటికి బంగారం ప్రపంచ మార్కెట్‌లో చాలా ఎక్కువ డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడి ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడం లేదు, వడ్డీ రేట్లు స్థిరంగా లేకపోవడం పెట్టుబడిదారుల్లో మరింత భయాన్ని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, చాలా మంది సేఫ్ పెట్టుబడి కోసం బంగారాన్ని ఎన్నుకుంటున్నారు. అలాగే సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇవన్నీ కలిపి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో బంగారం ధర పెరగడానికి కారనం అవుతున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
ఎంత పెరుగుతుంది?
Image Credit : Pixabay

ఎంత పెరుగుతుంది?

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర సాధారణంగా ఔన్స్‌లో కొలుస్తారు. కానీ మనం భారత్‌లో మాత్రం గ్రాములలో కొనుగోలు చేస్తాం. ఒక ఔన్స్ అంటే సుమారు 28.35 గ్రాములు. బంగారం ప్రపంచ మార్కెట్‌లో పెద్ద ఎత్తున పెరిగితే ఒక్క గ్రాము ధర రూ.14,000 నుంచి రూ.15,000 వరకు చేరే అవకాశం ఉంది. దీని ఆధారంగా 10 గ్రాముల ధర దాదాపు రూ.1,40,000 నుండి రూ.1,57,000 మధ్య ఉండవచ్చు. అయితే ఇది ఖచ్చితమైన ధర కాదు. ఒక అంచనా మాత్రమే. వాస్తవ ధర మన దేశంలోని డిమాండ్, రూపాయి విలువ, పన్నులు, మార్కెట్ పరిస్థితులు ఆధారంగా మారిపోతుంది.

Related Articles

Related image1
First Home loan: మనదేశంలో మొదటి హోమ్ లోన్ ఏ బ్యాంకు ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది?
Related image2
Today Gold Rate: మళ్లీ బంగారం ధరలో పెరుగుదల, నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి
33
బంగారం కొనడం కష్టమేనా?
Image Credit : Pixabay

బంగారం కొనడం కష్టమేనా?

భారతదేశంలో బంగారం ధర ఎప్పుడూ ప్రపంచ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రూపాయి విలువ కొద్దిగా బలహీనంగా ఉంది. అంతేకాక భారత్‌లో బంగారం గురించి ప్రజల్లో ఎప్పుడూ ఎక్కువ ఆసక్తి ఉంది. పెళ్లిళ్లు, పండుగలకు కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. రాబోయే రెండు సంవత్సరాల్లో గోల్డ్ ధర 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,000 నుండి రూ.1,57,000 వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్పిన అత్యధిక అంచనా ప్రకారం రూపాయి బలహీనపడినా, ప్రపంచ మార్కెట్ ధరలు పెరిగితే మాత్రం 10 గ్రాములు రూ.1.57 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. లేకపోతే సాధారణ పరిస్థితుల్లో 10 గ్రాముల ధర రూ.1.30–₹1.40 లక్షల మధ్య ఉండొచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
బంగారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image2
Gold Price Fall: బంగారం మళ్లీ డౌన్ ఫాల్.. వెండి కొండెక్కింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!
Recommended image3
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Related Stories
Recommended image1
First Home loan: మనదేశంలో మొదటి హోమ్ లోన్ ఏ బ్యాంకు ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది?
Recommended image2
Today Gold Rate: మళ్లీ బంగారం ధరలో పెరుగుదల, నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved