- Home
- Business
- Post office: డబ్బులు గుడ్లు పెట్టడం అంటే ఇదేనేమో.. అస్సలు రిస్క్ లేకుండా రూ. 3.6 లక్షల వడ్డీ
Post office: డబ్బులు గుడ్లు పెట్టడం అంటే ఇదేనేమో.. అస్సలు రిస్క్ లేకుండా రూ. 3.6 లక్షల వడ్డీ
Post office: డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దానిని సరైన విధానంలో పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ వచ్చే ఒక బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
పోస్టాఫీస్ అందిస్తోన్న బెస్ట్ సేవింగ్ స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఒకటి. ఇది ఒక స్థిర ఆదాయ పొదుపు పథకం. సేఫ్ గా, స్టాక్-మార్కెట్ ప్రమాదం లేకుండా పెట్టుబడి పెంచాలనే వారికి మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ప్రభుత్వ మద్దతు ఉండడంతో మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు.
5 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్
సాధారణంగా ఈ పథకానికి 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియ్ ఉంటుంది. ఈ సమయంలో మూలధనం తీసుకోవడం సాధ్యంకాదు.
వడ్డీ రేటు: ప్రస్తుతం (గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం) NSC వడ్డీ 7.7% గా ప్రకటించారు. వడ్డీ ఏడాదికి ఒకసారి కలిపి మెచ్యూరిటీ అయిన తర్వాత చెల్లిస్తారు.
ఎంతపెట్టుబడి పెట్టొచ్చు: ఇందులో కనీసంగ రూ.1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి అంటూ ప్రత్యేకంగా ఏం లేదు.
గవర్నమెంట్ గ్యారెంటీ: NSC ప్రభుత్వ హామీ పథకం కావడంతో మూలధనానికి రక్షణ ఉంది.
పన్ను ప్రయోజనాలు (Tax benefit)
NSC లో పెట్టిన మొత్తం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్-80C కింద సంవత్సరానికి కనీసం రూ. 1.5 లక్షల వరకు మినహాయింపుగా చూపుకోవచ్చు. దీంతో టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.
ఎవరికి బెస్ట్ ఆప్షన్.?
* పన్ను ఆదా కూడా కావాలి, రిస్క్ ఉండకూడదు అనుకునే ఉద్యోగులకు ఇది బెస్ట్ ఆప్షన్.
* పదవీ విరమణ చేసిన సిటిజన్లు. జీవితంలో స్థిర ఆదాయాన్ని కోరుకునేవారికి.
* పిల్లల చదువు/భవిష్యత్తు కోసం కొంత కాలం పాటు డబ్బును భద్రపరుచుకోవాలనుకునే వారు.
రూ. 8 లక్షలు పెట్టుబడి పెడితే
ఉదాహరణకు మీరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో రూ.8,00,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. దీనిపై మీరు దాదాపు రూ. 3,59,226వడ్డీని పొందుతారు. దీంతో మీ మొత్తం మెచ్యూరిటీ విలువ రూ. 11,59226 అవుతుంది. దీని అర్థం మీరు ఇంట్లో కూర్చుని, ఎటువంటి రిస్క్ లేకుండా మీ పెట్టుబడిపై అదనంగా దాదాపు రూ. 3.6 లక్షలు సంపాదించవచ్చన్నమాట.