కష్టపడకుండా నెలకు రూ.5 వేలు సంపాదించండిలా..
డబ్బులు సంపాదించాలంటే ఎవరైనా కష్టపడాలి కదా.. కాని మీరు ఏం కష్టపడకుండానే నెలకు రూ.5 వేలు ఈజీగా సంపాదించొచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. కొందరు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తుంటారు. మరికొందరు స్మార్ట్ గా ఆలోచించి ఎటువంటి కష్టం లేకుండానే ఆదాయం పొందుతారు. అలాంటి వారు ఎటువంటి పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసే వారికంటే ఎక్కువ సంపాదిస్తుంటారు. వారు చేసే పని ఏంటంటే.. పెట్టుబడులు పెట్టడం. తెలివి తేటలు ఉపయోగించి మీకు అవగాహన రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ఆదాయం సంపాదించొచ్చు.
పెట్టుబడులు పెట్టడంలోనూ అనేక మార్గాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో షేర్స్ కొనడం ఒక రకమైతే, సొంత బిజినెస్ ప్రారంభించి పెట్టుబడి పెట్టి లాభదాయకంగా నడిపించడం మరో మార్గం. వీటిల్లో రిస్క్ ఉంటుంది కాబట్టి సేఫ్ గా పెట్టుబడులు పెట్టాలనుకొంటే ఉత్తమమైన మార్గం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మనీ దాచుకోవడం. దీని వల్ల నికరంగా వడ్డీ వస్తుంది. బ్యాంకుల్లోనైనా కాస్త రిస్క్ ఉంటుందేమో కాని ఎటువంటి రిస్క్ లేని ప్లేస్ పోస్టాఫీస్. ఇక్కడ మంచి లాభాలనిచ్చే స్కీమ్ లు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మీ డబ్బులు పెట్టడం ద్వారా ప్రతి నెలా నికర ఆదాయం పొందవచ్చు.
చాలా మంది పొదుపు చేయాలనుకుంటారు. కానీ డబ్బును ఎలా పొదుపు చేయాలో చాలా మందికి తెలియదు. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. మీ జీతం నుండి మంచి మొత్తాన్ని పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం చాలా సురక్షితం.
ఇది సాధారణంగా రిస్క్ లేని నెలవారీ ఆదాయ పథకం. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెడితే తర్వాత ఐదు సంవత్సరాలకు నెలవారీ ఆదాయం వస్తుంది. ఇది సింగిల్ గాను, జాయింట్ ఖాతాలుగా ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం వడ్డీ రేటు 7.4 శాతం. సింగిల్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం(POMIS)లో పెట్టుబడి పెట్టి ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకం ద్వారా మీకు 7.4% వడ్డీ లభిస్తుంది. ప్రతి నెలా మంచి ఆదాయం కావాలనుకునేవారు ఈ పథకంలో చేరవచ్చు.
మెచ్యూరిటీ సమయంలో పూర్తి మొత్తం తిరిగి తీసుకోవచ్చు. ఈ పథకం వ్యవధి ఐదు సంవత్సరాలు. గడువు ముగిసిన తర్వాత కావాలనుకుంటే మరో ఐదు సంవత్సరాలకు పొడిగించవచ్చు. ఈ డిపాజిట్‌పై వడ్డీ ప్రతి నెలా మీ ఖాతాలో జమ అవుతుంది.
సింగిల్ ఖాతాలో డిపాజిట్ చేస్తే గరిష్ట వడ్డీ రేటు 7.4 శాతం వస్తుంది. దీని ప్రకారం ప్రతి నెలా మీరు రూ.5,550 నికర ఆదాయంగా పొందవచ్చు. అంటే సంవత్సరానికి రూ.66,600 వడ్డీ రూపంలో తీసుకొవచ్చు. దీని కోసం మీరు ప్రత్యేకంగా ఏ పని చేసి కష్టపడాల్సిన పని లేదు. మీ సేవింగ్స్ ను ఒక ఐదు సంవత్సరాల పాటు పోస్టాఫీసులో దాచుకోవడమే. ఇలా సంవత్సరానికి వడ్డీ రూపంలో రూ.66,000 తీసుకొంచే అయిదేళ్లకు రూ.3.33 లక్షలు అవుతుంది. ఈ అమౌంట్ మీకు సరైన సమయంలో ఉపయోగపడుతుంది. మీకు నెలనెలా మంచి ఆదాయం రావాలంటే ఈ పథకాన్ని ఉపయోగించుకోండి.
అకౌంట్ ఇలా ఓపెన్ చేయండి..
ఈ స్కీమ్ లో చేరాలంటే మీరు మొదట రూ.1000 పెట్టి అకౌంట్ ఓపెన్ చేయాలి.
ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్... వీటిల్లో ఏదో ఒకదాని జిరాక్స్ సమర్పించాలి.
2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో పాటు యుటిలిటీ బిల్లు సమర్పించాలి.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం కోసం ఫారమ్‌ను పూర్తి చేసి సిబ్బందికి ఇస్తే అకౌంట్ ఓపెన్ చేస్తారు.