- Home
- Business
- Post office: మీ డబ్బులే డబ్బులను సంపాదిస్తాయి.. ఈ స్కీమ్‌తో ప్రతీ నెల మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయ్
Post office: మీ డబ్బులే డబ్బులను సంపాదిస్తాయి.. ఈ స్కీమ్‌తో ప్రతీ నెల మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తాయ్
Post office: మారుతోన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో నిరంతర ఆదాయం కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పదవి విరమణ తర్వాత నెలవారీ ఖర్చులకు డబ్బు అవసరపడుతుంది. అలాంటి వారి కోసమే పోస్టాఫీస్ MIS పేరుతో మంచి స్కీమ్ తీసుకొచ్చింది.

పోస్ట్ ఆఫీస్ MIS స్కీమ్ అంటే ఏమిటి?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా స్థిర ఆదాయం ఇచ్చే సేవింగ్ స్కీమ్. ఈ పథకం ముఖ్యంగా నెలవారీ ఆదాయం కావాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. పదే పదే డబ్బు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒకే సారి పెట్టుబడితో ఆదాయం వస్తుంది.
MIS స్కీమ్ వడ్డీ రేటు, నెలవారీ ఆదాయం
ప్రస్తుతం ఈ స్కీమ్‌పై పోస్ట్ ఆఫీస్ 7.4 శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెలా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. వచ్చిన డబ్బును ఖాతాలో ఉంచుకోవచ్చు లేదా అవసరమైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆదాయం పూర్తిగా ఫిక్స్‌గా ఉంటుంది.
పెట్టుబడి పరిమితులు ఎలా ఉంటాయి?
ఈ స్కీమ్‌లో ఖాతా తెరవడానికి కనీసం రూ.1000 పెట్టుబడి సరిపోతుంది. సింగిల్ అకౌంట్ లో గరిష్ఠ పెట్టుబడి: రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ లో గరిష్ఠ పెట్టుబడి: రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్‌లో గరిష్ఠంగా ముగ్గురు సభ్యులు ఉండవచ్చు.
నెలకు రూ.5550 ఆదాయం ఎలా వస్తుంది?
మీరు సింగిల్ అకౌంట్‌లో ఒకే సారి రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ.5550 వడ్డీ వస్తుంది. ఈ మొత్తం 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నెలవారీ ఖర్చులకు ఇది నమ్మకమైన ఆదాయ వనరుగా మారుతుంది. ఒకవేళ గరిష్ఠంగా రూ. 15 లక్షల పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ. 9500 పొందొచ్చు.
మెచ్యూరిటీ, అకౌంట్ ఓపెనింగ్ విధానం
ఈ MIS స్కీమ్ కాలవ్యవధి 5 సంవత్సరాలు. గడువు పూర్తయిన తర్వాత మీరు పెట్టిన మొత్తం డబ్బు పూర్తిగా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. పెట్టుబడి మొత్తం సురక్షితంగా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఖాతా ఓపెన్ చేసిన వెంటనే నెలవారీ ఆదాయం ప్రారంభమవుతుంది.

