ష్యూరిటీ లేకుండా రుణం.. మోదీ సర్కార్ అదిరిపోయే స్కీమ్! మీరు అర్హులైనా?
PM SVANidhi Scheme: ఈ కాలంలో ష్యూరిటీ లేకుండా రుణాలు ఎవరిస్తారు. కాని మోదీ సర్కార్ ఆ పని చేస్తోంది. వ్యాపార వేత్తలను ప్రోత్సహించాలని ష్యూరిటీ లేకుండా లోన్స్ ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా వడ్డీ రాయితీ, క్యాష్‌బ్యాక్ రివార్డు కూడా పొందొచ్చు. మరి ఆ పథకం వివరాలు తెలుసుకుందాం రండి.

వీధి వ్యాపారులకు ఉపయోగపడేలా ప్రధానమంత్రి వీధి విక్రేత ఆత్మనిర్భర్ నిధి (PM SVANidhi) పథకం ప్రారంభించారు. వాళ్లకు ఆర్థికంగా భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు.
ప్రధానమంత్రి స్వనిధి పథకం అంటే ఏమిటి?
ఇది కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని జూన్ 2020లోనే ప్రారంభించింది. ఈ పథకం కింద ష్యూరిటీ అవసరం లేకుండా రుణాలు ఇస్తారు. ఇందులో రుణం తిరిగి చెల్లించడానికి కఠినమైన నిబంధనలు ఏమీ లేకపోవడం విశేషం.
ఈ పథకం ద్వారా దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారులను చేర్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పథకం కింద ముందు రూ.10,000 రుణం ఇస్తారు. దీన్ని తిరిగి సక్రమంగా చెల్లిస్తే రెండో విడతలో రూ.20,000 రుణం ఇస్తారు. అవి కూడా ఎలాంటి ఎగవేతలు లేకుండా చెల్లిస్తే ఈసారి రూ.50,000 రుణం ఇస్తారు.
రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే లాభాలేంటి?
సకాలంలో డబ్బులు చెల్లిస్తే తర్వాత ఇచ్చే రుణ సాయం పెరుగుతుంది. ఈ లోన్ 7% వార్షిక వడ్డీ రాయితీ, రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినందుకు ఏడాదికి రూ.1200 క్యాష్‌బ్యాక్ రివార్డు కూడా ఉంది.
పథకం అర్హత ప్రమాణాలు ఏమిటి?
పట్టణాల్లో పండ్లు, కూరగాయలు, స్ట్రీట్ ఫుడ్, వస్తువులు అమ్మే వ్యాపారులు, హెయిర్ సెలూన్, లాండ్రీ వంటి సేవలు అందించే వ్యాపారులు ఈ పథకానికి అర్హులు. వీధి వ్యాపారాలు చేయడానికి సర్టిఫికెట్ లేని అభ్యర్థులు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. లోకల్ ఎంక్వైరీ చేసిన తర్వాత తాత్కాలిక సర్టిఫికెట్‌కు అప్లై చేసుకోవచ్చు.
PM SWANidhi ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా రుణం పొందడం చాలా సులువు. వీధి వ్యాపారులు రుణం కోసం అప్లై చేయడానికి ఆధికారిక వెబ్‌సైట్: https://pmsvanidhi.mohua.gov.in/ ను సందర్శించండి.
అవసరమైన డాక్యుమెంట్లు:
ఆధార్ కార్డు (మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి)
వోటర్ ఐడి / రేషన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్
బ్యాంక్ ఖాతా వివరాలు
స్ట్రీట్ వెండర్ సర్టిఫికేట్ (లేకపోయినా పర్లేదు)