MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • త్వరలోనే మరో బిగ్ షాక్..? పెట్రోల్ ధర లీటరుకు రూ.200 దాటుతుందా..?

త్వరలోనే మరో బిగ్ షాక్..? పెట్రోల్ ధర లీటరుకు రూ.200 దాటుతుందా..?

భారతదేశంలో వాహనదారులకు మరో బిగ్ షాక్ రానుందా..? గత కొంతకాలంగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు (fuel prices)సామాన్యుడికి పెను భారంగా మారింది. అయితే తాజాగా దీపావళి (diwali)పండుగ సందర్భంగా కేంద్రం ఇంధన ధరలపై భారీగా ఉపశమనం కల్పిస్తూ ఎక్సైజ్‌ టాక్స్ ధరలను తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదనంగా ఇంధన ధరల తగ్గింపును ప్రకటించాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 06 2021, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 కానీ  రానున్న రోజుల్లో పెట్రోల్ - డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా..? లీటర్ పెట్రోల్ ధర రూ.200కు పెరుగుతాయా..? అనే ప్రశ్నకు అవుననే అంటున్నారు ఇంధన నిపుణులు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  ఎన్నడూ లేని విధంగా ఆకాశానికి తాకుతుండటంతో ఆందోళన చెందిన సామాన్యులకు దీపావళి (Diwali) సందర్భంగా కేంద్రం తీపి కబురు చెప్పింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి ఇంధన ధరల భారాన్ని కాస్త దింపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 దీంతో పెట్రోల్ ధరలు దిగోచ్చాయి. అయితే  ఇంధన ధరల తగ్గింపు ఉపశమనం తాత్కాలికమేనని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరుగుతాయని  అంచనా వేసి వెల్లడించారు నరేంద్ర తనేజా. దేశంలో రానున్న నెలల్లో ఇంధన ధరల పెరుగుదల గురించి నరేంద్ర తనేజా షాకింగ్ విషయాలు తెలిపారు. 2023 నాటికి మరో రూ.100 పెరిగి లీటర్ పెట్రోల్ రూ.200 అవుతుందని అంచనా వేశారు. దేశంలో వినియోగించే చమురులో 86 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది కాబట్టి  వీటి ధరలు కేంద్రం నియంత్రనలో ఉండవన్నారు. డిమాండ్-సప్లయిలో  సమతుల్యం లేనప్పుడల్లా ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 

34

దేశీయ అవసరాల్లో 86 శాతం చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌-సప్లయ్‌కి అనుగుణంగా ధరలు మారుతుంటాయి. ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభమే కారణం. డిమాండ్ కి అనుగుణంగా సరఫరా లేకపోతే అనివార్యంగా ధరలు పెరుగుతాయి.

44

అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ఓ కారణం. కేవలం పునరుత్పాదక, హరిత ఇంధనంపైనే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కొన్ని నెలల్లో ఇంధన ధరలు మరింత పెరుగుతాయి. 2023 నాటికి లీటర్‌ ముడి చమురు ధర మరో రూ.100 ఎగబాకే అవకాశం ఉందన్నారు. ఆలాగే పెరుగుతున్న ఇంధన ధరలు  వాహనదారులను ఎలక్ట్రిక్  వాహనాల కొనుగులుకు మొగ్గు చూపేల చేస్తుంది. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Recommended image2
ఐఫోన్ డ్యూయో కొనే బదులు ఇలా చేస్తే.. నెలకు రూ. 30 వేల ఆదాయం ఖాయం
Recommended image3
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved