MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరల బాదుడు.. ఇక తగ్గేదే లే..?

రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరల బాదుడు.. ఇక తగ్గేదే లే..?

న్యూఢిల్లీ :  వరుసగా మూడోరోజు కూడా  అంటే ఆక్టోబరు 29న శుక్రవారం పెట్రోల్(petrol), డీజిల్(diesel) ధరలు దేశవ్యాప్తంగా మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు(crudeoil prices) పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు కూడా  ఇంధన ధరలను సవరించాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 29 2021, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం దేశ రాజధానిలో పెట్రోల్ ధర  30 నుండి 37 పైసలు పెరిగి రూ.108.64 చేరగా , డీజిల్ ధర  35 పైసలు  పెరిగి రూ.97.37గా ఉంది.  తాజా పెంపు దేశ పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంధన ధరల పెంపు కారణంగా ఇప్పటికే ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగాయి.

విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF లేదా జెట్ ఇంధనం) విక్రయించే ధర కంటే ఇప్పుడు పెట్రోల్ ధర 37.52% ఎక్కువ. ఢిల్లీలో ఏ‌టి‌ఎఫ్ ధర లీటరుకు దాదాపు రూ. 79.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ముంబైలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 114.47, డీజిల్ ధర లీటరుకు రూ. 105.49. చెన్నైలో పెట్రోలు ధరల లీటర్‌కు రూ. 105 దాటి ప్రస్తుతం లీటరు ధర రూ. 105.43, డీజిల్ ధర రూ.101.59గా ఉంది. నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉందని ప్రభుత్వ ఆయిల్ రిఫైనర్ తెలిపింది.

విలువ ఆధారిత పన్ను లేదా VAT ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతున్నందున ఇంధన ధరలు ప్రతిరాష్ట్రానికి మారుతుంటుంది. తక్కువ వ్యాట్ కారణంగా దేశ రాజధానిలో ఇంధన ధరలు అత్యల్పంగా ఉన్నాయి.

ఇతర మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇక్కడ ఉన్నాయి:

నగరం      పెట్రోల్ ధర (రూ.లలో)      డీజిల్ ధర (రూ.లలో)
చెన్నై                   105.43                              101.59
కోల్‌కతా              109.12                                100.49
హైదరాబాద్        రూ. 113.00                       రూ.106.22

సోర్స్: ఇండియన్ ఆయిల్
 

33

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.

ప్రస్తుతం  బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $84.47గా ఉంది, ఇంతకుముందు ధర కంటే 0.10% పెరిగింది. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించిన కారణంగా దేశాల అంతటా డిమాండ్ పెరుగుతూనే ఉండగా, గట్టి సరఫరా కారణంగా క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. డాలర్-రూపాయి మారకం రేటు కూడా స్థానిక ఇంధన ధరలపై ప్రభావం చూపుతుంది. ఉదయం 10:50 గంటల సమయానికి, ఒక డాలర్ 74.78 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Recommended image2
ఐఫోన్ డ్యూయో కొనే బదులు ఇలా చేస్తే.. నెలకు రూ. 30 వేల ఆదాయం ఖాయం
Recommended image3
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved