- Home
- Business
- Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటే ఇదే మంచి టైమ్: రెపో రేటు తగ్గడంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి
Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటే ఇదే మంచి టైమ్: రెపో రేటు తగ్గడంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి
Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గించడంతో అనేక బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇది కొత్తగా లోన్ తీసుకొనే వారికి, ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి కూడా శుభవార్తే. ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటును తగ్గించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇల్లు కొనాలంటే ఇదే మంచి సమయం
మీరు ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం. జూన్ 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.50% తగ్గించింది. దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.5%కి చేరుకుంది. ఫిబ్రవరి 2025 నుండి RBI మొత్తం 1% తగ్గించింది.
ఇది కస్టమర్లకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. రెపో రేటు తగ్గడంతో అనేక బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. మీరు ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే ఈఎంఐ తగ్గుతుంది. ఇప్పుడు కొత్తగా తీసుకోవాలన్నా తక్కువ వడ్డీ చెల్లిస్తూ ఈఎంఐ బర్డెన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు తగ్గించాయో తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ బరోడా
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గించడంతో కలిగిన ప్రయోజనాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు అందించింది. ఈ బ్యాంక్ దాని RLLRని 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో RLLR ఇప్పుడు 8.15%కి చేరుకుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం దాని హోమ్ లోన్లు 8% ప్రారంభ రేటుతో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది అప్‌డేట్ చేసిన తాజా వడ్డీ రేటో కాదో స్పష్టంగా తెలియలేదు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా కస్టమర్లకు వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం కలిగించింది. బ్యాంక్ దాని RLLRని 8.85% నుండి 8.35%కి తగ్గించింది. ఇది జూన్ 9 నుండి అమలులోకి వస్తుంది.
"కస్టమర్లకు శుభవార్త! ఇప్పుడు మీ EMI ఇంకా చౌకగా ఉంటుంది. కొత్త హోమ్ లోన్ రేట్లు కేవలం 7.45% నుండి ప్రారంభమవుతాయి" అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సోషల్ మీడియాలో రాసింది. అంటే ఇప్పుడు ఈ బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకునేవారికి ప్రారంభ వడ్డీ రేటు 7.45 % అన్నమాట.
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ కూడా దాని వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు బ్యాంక్ RLLR 8.35%కి తగ్గింది. ఈ సమాచారం బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిసింది.
UCO బ్యాంక్
UCO బ్యాంక్ కూడా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ దాని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని తగ్గించింది. ఇది జూన్ 10 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది.
తక్కువ ఈఎంఐ కట్టండి.. ఎక్కువ పొదుపు చేయండి
రెండు సార్లు రెపో రేటు తగ్గడంతో కస్టమర్లకు ఒకేసారి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. రెపో రేటుతో RLLR ఆధారిత హోమ్ లోన్లు తీసుకున్న వారి లోన్ల ఈఎంఐ ఇప్పుడు తగ్గింది. అంటే ఇప్పటికే ఇల్లు కొన్న వారికి ఈఎంఐ తగ్గగా, కొత్తగా ఇల్లు కొనే వారు కూడా తక్కువ ఈఎంఐ కడుతూ ఎక్కువ డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.