MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పల్లోంజి వారసుడు ఇకలేరు..ఎవరు ఈ సైరస్ మిస్త్రీ...ఆయన జీవితంలోని ప్రముఖ ఘట్టాలు ఇవే..

పల్లోంజి వారసుడు ఇకలేరు..ఎవరు ఈ సైరస్ మిస్త్రీ...ఆయన జీవితంలోని ప్రముఖ ఘట్టాలు ఇవే..

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పొరుగున ఉన్న ముంబైలో కారు డివైడర్‌ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆయన వయసు 54. మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Sep 04 2022, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డిసెంబర్ 2012 నెలలో, రతన్ టాటా తన కలల వ్యాపార సామ్రాజ్యమైన టాటా సన్స్ ను  సైరస్ మిస్త్రీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడే సైరస్ మిస్త్రీ పేరు తెరపైకి వచ్చింది. ప్రసిద్ధ భారతీయ సంతతికి  పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ చిన్న కుమారుడే సైరస్ మిస్త్రీ. నిజానికి పల్లోంజి మిస్త్రీ ఐరిష్ మహిళను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఐర్లాండ్ పౌరసత్వం పొందారు. సైరస్ మిస్త్రీ కూడా ఐర్లాండ్‌లో జన్మించడానికి కారణం ఇదే. మిస్త్రీ 1968 జూలై 4న జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను అభ్యసించాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
<p>cyrus mistry</p>

<p>cyrus mistry</p>

పల్లోంజీ షాపూర్జీకి ఇద్దరు కుమారులు షాపూర్, సైరస్ మిస్త్రీ కాగా, వారికి  ఇద్దరు కుమార్తెలు  లైలా , అల్లు ఉన్నారు -. పల్లోంజీ షాపూర్జీ కుమార్తె అల్లు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాను వివాహం చేసుకున్నారు. టాటా కుటుంబంతో సైరస్ మిస్త్రీకి బంధుత్వం ఉందని చెప్పడానికి ఇదే కారణం.

37

భారత సంతతికి చెందిన అత్యంత విజయవంతమైన, శక్తివంతమైన వ్యాపారవేత్తలలో ఒకరైన 90 ఏళ్ల పల్లోంజీ మిస్త్రీ భారతదేశంతో పాటు పశ్చిమాసియా, ఆఫ్రికాలలో నిర్మాణ రంగంలో విస్తరించారు. అంతేకాదు తన కుమారులతో కలిసి టాటా సన్స్‌లో 18.5 శాతం వాటాను కూడా కలిగి ఉన్నాడు.

47

పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ వ్యాపారం వస్త్రాల నుండి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, వ్యాపార ఆటోమేషన్ వరకు విస్తరించింది. SPG గ్రూప్‌లో షాపూర్జీ పల్లోంజీ ఇంజనీరింగ్ & కన్‌స్ట్రక్షన్, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫోర్బ్స్ టెక్స్‌టైల్స్, గోకాక్ టెక్స్‌టైల్స్, యురేకా ఫోర్బ్స్, ఫోర్బ్స్ & కో, SP కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ గ్రూప్, SP రియల్ ఎస్టేట్, నెక్స్ట్ జెన్ వంటి కంపెనీలు ఉన్నాయి. 

57

ఐర్లాండ్‌లో జన్మించిన  సైరస్ మిస్త్రీ లండన్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. సైరస్ 1991లో కుటుంబానికి చెందిన పల్లోంజీ గ్రూప్‌లో పని చేయడం ప్రారంభించాడు. 1994లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సైరస్ మిస్త్రీ నాయకత్వంలో, అతని సంస్థ భారతదేశంలో ఎత్తైన రెసిడెన్షియల్ టవర్ నిర్మాణం, పొడవైన రైలు వంతెన నిర్మాణం, అతిపెద్ద ఓడరేవు నిర్మాణంతో సహా అనేక ప్రధాన రికార్డులను నెలకొల్పింది.

67

అదే సమయంలో, సైరస్ మిస్త్రీ 2006లో టాటా సన్స్ బోర్డులోకి ప్రవేశించారు. డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూప్ 18 నెలల శోధన తర్వాత సైరస్ మిస్త్రీని ఈ స్థానానికి ఎంపిక చేసింది. ఈ స్థానం కోసం అన్వేషణకు బాధ్యత వహించిన వారిలో లార్డ్ సుశాంత్ కుమార్ భట్టాచార్య,  బ్రిటిష్ వ్యాపారవేత్త, వార్విక్ మాన్యుఫ్యాక్చరింగ్ డైరెక్టర్, ప్రముఖ న్యాయవాది షిరిన్ భారుచా, N.A. సూనావాలా  ఉన్నారు. 

77

డిసెంబర్ 2012లో గ్రూప్ చైర్మన్ అయ్యారు. అయితే సైరస్ మిస్త్రీని ఉన్న పళంగా చైర్మన్ పదవి నుంచి తొలగించారు. దానిపై అధికారిక కారణాలు నిజానికి బాహ్యప్రపంచానికి పెద్దగా వెల్లడి కాలేదు. అయితే ఆయన రతన్ టాటా అంచనాలను అందుకోలేకపోయాడనే ఫిర్యాదు ఉంది. టాటా గ్రూప్ ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించలేదు. బహుశా సైరస్‌ని బయటకు పంపడానికి  ఇదే అతిపెద్ద కారణం అని నమ్ముతారు.

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? వడ్డీ భారం నుంచి ఎలా తప్పించుకోవాలి?
Recommended image2
SIP Investment : నెలకు ₹10 వేల పెట్టుబడితో ₹4.7 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులు కావాలంటే ఇది చూడాల్సిందే!
Recommended image3
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved