- Home
- Business
- పిల్లల పేరు మీద PPF ఖాతాను ఎలా తెరవాలి, పెద్దయ్యాక రూ. 32 లక్షలు ఎలా పొందాలో తెలుసుకోండి..
పిల్లల పేరు మీద PPF ఖాతాను ఎలా తెరవాలి, పెద్దయ్యాక రూ. 32 లక్షలు ఎలా పొందాలో తెలుసుకోండి..
పెరుగుతున్న ఖర్చుల మూలంగా తల్లిదండ్రుల ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. పిల్లల మంచి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని తల్లిదండ్రులు ప్లాన్ చేస్తుంటారు. అయితే చదువు, పెళ్లి పూర్తయ్యే వరకూ తల్లిదండ్రులకు ఈ టెన్షన్ తప్పదు. అయితే మీ టెన్షన్ ను అధిగమించడానికి, సరైన పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందస్తు ప్లాన్ చేసుకోవాలి.

తక్కువ డబ్బుతో దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందగలిగే పథకాలలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే PPF ఇందులో మీకు సహాయం చేస్తుంది. మీరు సరైన సమయంలో మీ మైనర్ పిల్లల కోసం PPF ఖాతాను తెరిచి, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. మీరు ప్రతి నెలా డబ్బు డిపాజిట్ చేయడం అలవాటు చేసుకుంటే, పిల్లలు పెద్దయ్యాక పెద్ద మొత్తంలో డబ్బను పొందే వీలుంది.
ముందుగా పిల్లల పేరిట PPF ఖాతాను ఎలా తెరవాలో తెలుసుకుందాం. అలాగే దీనికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమో కూడా చూద్దాం. పిపిఎఫ్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో వయస్సు పరిమితి లేదు. మీరు దాని ఖాతాను తెరిచి, మీకు కావలసినప్పుడు పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు ఏదైనా అధీకృత బ్యాంకు శాఖకు వెళ్లి అక్కడ ఫారం 1 నింపండి. ఇంతకుముందు ఈ ఫారమ్ పేరు ఫారం A, కానీ ఇప్పుడు దీనిని ఫారమ్ 1 అని పిలుస్తారు. ఇంటి దగ్గర ఏదైనా బ్రాంచ్ ఉంటే అక్కడ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని నిర్వహించడం కూడా సులభం అవుతుంది.
ఖాతా తెరవడానికి, మీరు మీ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ వివరాలను అడ్రస్ ప్రూఫ్ గా ఇవ్వవచ్చు. గుర్తింపు రుజువు కోసం, పాన్ కార్డ్, ఆధార్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వవచ్చు. మీరు మీ మైనర్ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా అందించాలి. ఖాతా తెరిచే సమయంలో, మీరు కనీసం రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చెక్కును ఇవ్వాలి. ఈ పత్రాలన్నీ పూర్తయిన తర్వాత, మీ పిల్లల పేరు మీద PPF పాస్‌బుక్ జారీ చేయబడుతుంది.
ఇలా చేస్తే 32 లక్షలు పొందుతారు
పిల్లల పేరు మీద PPF ఖాతా నుండి 32 లక్షల రూపాయలు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పిల్లల వయస్సు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు PPF ఖాతాను తెరవడం ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. మీ బిడ్డకు 18 ఏళ్లు వచ్చే సమయానికి మీ PPF ఖాతా మెచ్యూర్ అవుతుంది. తర్వాత మీరు వ్యవధి కావాలనుకుంటే పెంచుకోవచ్చు, ఉదాహరణకు 15 సంవత్సరాల లెక్కను పరగణలోకి తీసుకుందాం. మీరు పిల్లల PPF ఖాతాలో ప్రతి నెలా రూ. 10,000 జమ చేయడం ప్రారంభించారు.
మీరు 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఇప్పుడు 7.10 శాతం చొప్పున రాబడిని కలిపితే, PPF ఖాతా మెచ్యూరిటీపై, పిల్లలకు రూ. 3,216,241 లభిస్తుంది. పిల్లలకి 18 ఏళ్లు నిండినప్పుడు ఈ మొత్తం అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తం 18 సంవత్సరాల దృక్కోణం నుండి సరిపోతుంది, ఇది ఉన్నత విద్య లేదా ఇతర అవసరమైన ఖర్చులకు ఉపయోగించబడుతుంది.