Honda Shine 100: రూ.68,000కే 65 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్.. ఈఎంఐ కేవలం రూ.2,300
Honda Shine 100: హోండా కంపెనీ నుంచి కొత్త బైక్ రిలీజ్ అయ్యింది. దీని ధర కేవలం రూ.68,767 మాత్రమే. ఇంత తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్స్ ని, మైలేజ్ ని అందించింది హోండా కంపెనీ. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా కొత్త OBD2B-కంప్లైంట్ షైన్ 100 మోడల్ ని రిలీజ్ చేసింది. హోండా కంపెనీ బైక్స్ లలో షైన్ 100 మాత్రమే తక్కువ ధర ఉన్న బైక్. ఈ షైన్ 100 మోడల్ లోనే ఇప్పుడు కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. కొత్త షైన్ 100లో 98.98cc ఇంజన్ ను కలిగి ఉంది. ఇది 7.38PS పవర్, 8.04Nm టార్క్ ఇస్తుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
హోండా షైన్ 100 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాకుండా ఇది 5 రంగుల వెరైటీలు ఉన్నాయి. హోండా షైన్ 100 98.98cc BS6 ఇంజిన్‌తో శక్తిని కలిగి ఉంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉండటం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ఈ షైన్ 100 బైక్ బరువు 99 కిలోలు ఉంటుంది. అంతేకాకుండా 9 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
షైన్ 100 డిజైన్.. షైన్ 125 డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే హోండా లోగోలో కొత్త గ్రాఫిక్స్ ఉన్నాయి. దీనికి బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్‌ను మీరు ఐదు రంగుల్లో కొనొచ్చు. నలుపు+ఎరుపు, నలుపు+నీలం, నలుపు+నారింజ, నలుపు+బూడిద, నలుపు+ఆకుపచ్చ.
షైన్ 100 సుమారు 65 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఫీచర్ల పరంగా చూస్తే.. హోండా షైన్ 100 స్పీడోమీటర్, ఓడోమీటర్, ఇంధన స్థాయి రీడౌట్, న్యూట్రల్ ఇండికేటర్, చెక్ ఇంజిన్ లైట్ వంటి ముఖ్యమైన ఫీచర్స్ ని కలిగి ఉంది. కొత్త షైన్ 100 తేలికైన డైమండ్ ఫ్రేమ్‌తో వస్తోంది. దీనికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు ఉన్నాయి. ఈ బైక్ హీరో స్ప్లెండర్+తో పోటీ పడుతుంది.