MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రేపటి నుంచే UPI కొత్త రూల్స్: పాటించకపోతే లావాదేవీలు బంద్

రేపటి నుంచే UPI కొత్త రూల్స్: పాటించకపోతే లావాదేవీలు బంద్

NPCI కొత్త నిబంధనలు: ఫిబ్రవరి 1, 2025 నుంచి UPI ID లలో కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నారు. UPI లావాదేవీల భద్రతను పెంచడానికి, సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి NPCI ఈ చర్యలు తీసుకుంది.

2 Min read
Anuradha B
Published : Jan 31 2025, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
UPI లావాదేవీలపై NPCI నిబంధనలు

UPI లావాదేవీలపై NPCI నిబంధనలు

రేపటినుంచి నుంచి UPI ID లలో స్పెషల్ క్యారెక్టర్స్ని  వాడకూడదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. అన్ని UPI లావాదేవీలు సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఈ చర్య తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపుల వేదిక మొత్తం భద్రతను కూడా పెంచవచ్చని చెబుతున్నారు.

28
UPI కొత్త నిబంధనలు

UPI కొత్త నిబంధనలు

జనవరి 9న NPCI కొత్త నిబంధనల ప్రకటన విడుదల చేసింది. కొత్త నిబంధన ప్రకారం, అన్ని UPI IDలు తప్పనిసరిగా సంఖ్యలు, అక్షరాలను మాత్రమే కలిగి ఉండాలి. అంటే, @, !, లేదా # వంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న UPI IDలను తిరస్కరిస్తారు.

38
UPI యాప్స్

UPI యాప్స్

చాలా మంది UPI వినియోగదారులు స్పెషల్ క్యారెక్టర్స్ లేని IDలనే వాడుతున్నప్పటికీ, కొంతమంది స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న IDలను వాడుతున్నారు. దీనికి పరిష్కారంగా, 2025 ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని NPCI నిర్ణయించింది.

48
UPI IDలో స్పెషల్ క్యారెక్టర్స్

UPI IDలో స్పెషల్ క్యారెక్టర్స్

కోట్లాది మంది భారతీయులపై ఈ మార్పు కొంత ప్రభావం చూపుతుంది. స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న UPI IDతో చెల్లింపులు చేయడానికి ప్రయత్నిస్తే, లావాదేవీ విఫలమవుతుంది.

58
UPI ID నిబంధనలు

UPI ID నిబంధనలు

ఉదాహరణకు, మీ ఫోన్ నంబర్ 1234567890 అనుకుందాం. మీకు స్టేట్ బ్యాంక్ తో UPI ID ఉంటే, మీ చెల్లుబాటు అయ్యే UPI ID 1234567890@oksbi అయి ఉండాలి. 1234567890@ok-sbi అయితే చెల్లదు. @ మరియు - అనే రెండు స్పెషల్ క్యారెక్టర్స్ ఉండటంతో దాన్ని ఆమోదించరు.

68
UPI చెల్లింపులు

UPI చెల్లింపులు

ఫిబ్రవరి 1 నుంచి UPI లావాదేవీ విఫలం కాకుండా ఉండాలంటే, వినియోగదారులు కొన్ని సులభమైన చర్యలు తీసుకోవచ్చు. ముందుగా, UPI యాప్ ని తాజా వెర్షన్ కి అప్డేట్ చేసుకోవాలి.

78
UPI లావాదేవీ IDలు

UPI లావాదేవీ IDలు

UPI యాప్ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తెలియకపోతే, యాప్ కస్టమర్ సర్వీస్ ని సంప్రదించవచ్చు. యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ వేదికల నుంచి డౌన్లోడ్ చేసుకున్న UPI యాప్స్ ని మాత్రమే వాడాలి. ఇతర మార్గాల్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ NPCI నిబంధనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు.

88
UPI లావాదేవీలు

UPI లావాదేవీలు

UPI IDలలో స్పెషల్ క్యారెక్టర్స్ ని నిషేధించాలనే నిర్ణయం UPI లావాదేవీ వ్యవస్థను ప్రామాణీకరించడానికి, భద్రపరచడానికి తీసుకున్న చర్య. UPI భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల్లో ఒకటిగా మారింది. NPCI విడుదల చేసిన డేటా ప్రకారం, డిసెంబర్ 2024లో UPI లావాదేవీల సంఖ్య 16.73 బిలియన్లకు చేరుకుంది. ఇది మునుపటి నెల కంటే 8 శాతం ఎక్కువ.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved