- Home
- Business
- మీకు క్రెడిట్ కార్డు ఉందా.? నవంబర్ 1 నుంచి జరిగే ఈ మార్పులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే
మీకు క్రెడిట్ కార్డు ఉందా.? నవంబర్ 1 నుంచి జరిగే ఈ మార్పులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే
New Rules: నవంబర్ 1వ తేదీ నుంచి పలు ఆర్థిక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంక్ నామినేషన్లు, క్రెడిట్ కార్డు ఛార్జీలు, పెన్షనర్ సర్టిఫికెట్లు మొదలైన అంశాలపై కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.

ఎస్బీఐ కార్డు కొత్త ఛార్జీలు
నవంబర్ 1 నుంచే ఎస్బీఐ కార్డు వినియోగదారులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. థార్డ్ పార్టీ యాప్స్ అయిన క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి వాటి ద్వారా విద్యా చెల్లింపులు చేస్తే 1% ఛార్జీ వసూలు చేస్తారు. అయితే, స్కూల్/కాలేజ్ అధికారిక వెబ్‌సైట్ లేదా POS యంత్రాల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. అలాగే, రూ. 1,000 కంటే ఎక్కువ విలువ గల వాలెట్ రీచార్జ్‌లపై కూడా 1% ఛార్జీ వర్తిస్తుంది. ఎస్బీఐ కార్డు ప్రకారం, ఈ మార్పులు డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న ఖర్చులను సమతుల్యం చేయడానికే.
బ్యాంకు డిపాజిట్లకు మల్టిపుల్ నామినేషన్లు అనుమతి
నవంబర్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ లాజ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం కొత్త నామినేషన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు ఒక్కరినే నామినేట్ చేయగలిగేవారు. ఇకపై ఒక్క ఖాతాకు గరిష్ఠంగా నలుగురిని నామినేట్ చేయవచ్చు. ఖాతాదారులు ఒకేసారి అందరినీ నామినేట్ చేయొచ్చు లేదా ఒకరి తర్వాత మరొకరిని క్రమపద్ధతిలో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ మార్పు వల్ల అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత వారసత్వంపై తగాదాలు తగ్గుతాయని, క్లెయిమ్ ప్రక్రియ సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లాకర్ ఛార్జీల తగ్గింపు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన లాకర్ అద్దె రేట్లను తగ్గించింది. అన్ని ప్రాంతాల్లో ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ కొత్త రేట్లు ప్రకటన చేసిన 30 రోజుల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. సాధారణ కస్టమర్లకు లాకర్ సేవలను మరింత సులభంగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి సంవత్సరం “జీవన్ ప్రమాణం” (Life Certificate) సమర్పించాలి. ఈసారి గడువు నవంబర్ 1 నుంచి నవంబర్ 30, 2025 వరకు ఉంటుంది. 80 ఏళ్లు పైబడిన పెన్షనర్లు మాత్రం అక్టోబర్ 1 నుంచే సమర్పణ ప్రారంభించవచ్చు. పత్రాన్ని డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో ఇవ్వొచ్చు. ఇది సమర్పిస్తేనే పెన్షన్ జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
NPS నుంచి UPSకు మారేందుకు గడువు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు National Pension System (NPS) నుంచి Unified Pension Scheme (UPS) కు మారేందుకు గడువు నవంబర్ 30, 2025 వరకు పొడిగించారు. ఈ సౌకర్యం రిటైర్డ్ ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా వర్తిస్తుంది.