- Home
- Business
- Multiple Bank Accounts ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఫైన్ కట్టాలా? ఆర్బీఐ రూల్స్ఏం చెబుతున్నాయి?
Multiple Bank Accounts ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఫైన్ కట్టాలా? ఆర్బీఐ రూల్స్ఏం చెబుతున్నాయి?
సాధారణంగా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే ఒక వ్యక్తికి ఒకటికంటే ఎక్కువగా పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉండటం సహజం. అయితే ఒకటి కంటే ఎక్కువ లావాదేవీలు ఉంటే జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈమధ్యకాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రూ.10వేలు జరిమానా?
‘ఇకపై ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే రూ.10 వేలు ఫైన్ కట్టాలి. ఆర్బీఐ ఈ రూల్ పెట్టింది’. ఇలాంటి వార్తలు మీరు చాాలా వినే ఉంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు.
ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఫైన్ కట్టాలని ప్రభుత్వం ఎలాంటి రూల్ పెట్టలేదు. ఆర్బీఐ ప్రకారం ఎవరికైనా ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లు ఉండొచ్చు. ఫైన్ లేదు.
కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కడైనా చూస్తే నిజమా కాదా అని ముందు తెలుసుకోండి. తప్పుడు విషయాలు షేర్ చేస్తే మీ మీద చర్యలు తీసుకోవచ్చు. ఒక వ్యక్తికి చాలా బ్యాంక్ అకౌంట్లు ఉండి, అందులో ఏదైనా తప్పుడు లావాదేవీలు జరిగితే మాత్రమే ఫైన్ కట్టాల్సి వస్తుంది.
మోసాలు, దొంగతనాలు తగ్గించడానికి ఆర్బీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ అకౌంట్లకి ఫైన్ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లలో తప్పుగా లావాదేవీలు చేస్తే రూ.10,000 ఫైన్ కట్టాలి. కట్టకపోతే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకుంటుంది.
కొత్త రూల్స్ ప్రకారం ఎవరికైనా చాలా బ్యాంకుల్లో రెండు లేదా ఎక్కువ అకౌంట్లు ఉంటే, అనుమానాస్పద లావాదేవీలు ఉంటే ఫైన్ చెల్లించాలి. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే అకౌంట్ రికార్డులు పెట్టుకోవాలి, మంచి అకౌంట్లను మాత్రమే వాడాలి.