MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ఇంత తక్కువ ధరలో ఇన్ని సేఫ్టీ ఫీచర్సా? దేశంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే రెండు కార్లు ఇవే

ఇంత తక్కువ ధరలో ఇన్ని సేఫ్టీ ఫీచర్సా? దేశంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే రెండు కార్లు ఇవే

దేశంలో బాగా అమ్ముడయ్యే కార్లలో రెండు కార్లు బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు అవే రెండు కార్లు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ తో మళ్లీ మార్కెట్ లోకి వస్తున్నాయి. అవి ఏ కంపెనీ కార్లు, వాటి సేఫ్టీ ఫ్యూచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 12 2025, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశంలో బాగా అమ్ముడయ్యే కార్లలో మారుతి వ్యాగన్ఆర్, మారుతి ఈకో  టాప్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కార్లు ఎక్కువ సేఫ్టీ ఫ్యూచర్లతో తిరిగి మార్కెట్ లోకి వస్తున్నాయి. ఈ కార్లలో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఫిట్ చేస్తున్నారు. దీంతో ఈ కార్లు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయా అని వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

హాచ్‌బ్యాక్ విభాగంలో భారతీయులకు వ్యాగన్ ఆర్ ఒక మంచి సెలక్షన్ అని చెప్పొచ్చు. ఈ విభాగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని సుజుకి కొత్త సేఫ్టీ ఫీచర్లతో వాహనాన్ని అప్‌డేట్ చేసింది. 2025 వ్యాగన్ ఆర్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2025 వ్యాగన్ ఆర్

ధరల విషయానికి వస్తే 2025 వ్యాగన్ ఆర్ బేస్ వేరియంట్‌కు రూ.5,64,000 ధరగా నిర్ణయించారు. అదే సమయంలో హై-ఎండ్ ZXI + AGS వేరియంట్ రూ.7,35,000 వరకు ధర ఉంది. కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించేలా సేఫ్టీ రూల్స్ మార్చింది. వ్యాగన్ ఆర్ తో పాటు ఈకో మోడల్ కూడా ఇలాంటి సేఫ్టీ మార్పులతో  అప్‌డేట్ అయి వస్తోంది. 

35

ధర పెరుగుదల

కొత్త అప్‌డేట్‌ల ప్రకారం వ్యాగన్ ఆర్ ఇప్పుడు వేరియంట్‌ను బట్టి సుమారు రూ.13,000 వరకు ధర పెరుగుతుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, కారులో ఏబీఎస్, ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, ప్రయాణికులందరికీ రిమైండర్‌లు ఇచ్చే బెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 

45

మారుతి సుజుకి ఈకో 7 సీటర్ కార్

మారుతి సుజుకి ఈకో మోడల్ ఒక 7 సీటర్ కారు. ఇంతకు ముందు కేవలం డ్యుయల్ ఎయిర్ బ్యాగులు మాత్రమే ఇందులో ఉండేవి. ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఫిట్ చేయించడంతో ఈ కారుకు డిమాండ్ పెరిగింది. ఈ కారులో ఎయిర్ బ్యాగులు పెంచడం తప్ప కొత్త మార్పులేవీ చేయలేదు.

ఈ కారులో LXI, VXI, ZXI వంటి రకాలు కూడా ఉన్నాయి. CNG ట్రిమ్ LXI, VXI ట్రిమ్ అనే మోడల్స్ లో అందుబాటులో ఉంది. ఆఫర్‌లో ఉన్న రెండు ఇంజన్లు 65 Bhp 1.0l 3 సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 88 Hp 1.2 L 4 సిలిండర్ Na పెట్రోల్ ఇంజన్ లతో ఈ కార్లు పనిచేస్తాయి. 

 

55

సుజుకి ఈకో 

ప్రస్తుతానికి సుజుకి ఈకో బేసిక్ స్టాండర్డ్ ధర రూ.5.44 లక్షలతో ప్రారంభమవుతుంది. ఏసి(0) 5ఎస్ సిఎన్‌జి వేరియంట్‌ ధర రూ.6.7 లక్షల వరకు ఉంది. ఇది సాధారణంగా 7 సీటర్ కారు. కాని ఇందులో 6 సీట్ల వేరియంట్‌ కూడా ఉంది. ఇందులో మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లు ఉంటాయి. 

ఇది కూడా చదవండి 6 నెలల్లో 20,000 కార్ల అమ్మకాలు.. రికార్డు క్రియేట్ చేసిన ఎలక్ట్రిక్ కారు ఏంటో తెలుసా?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved