గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి.. వీరికి మాత్రం రిలీఫ్..
ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ 19 కిలోల కమర్షియల్ LPG ధరలను రూ.101.5 వరకు పెంచాయి. దేశంలోని మెట్రో నగరాలలో నవంబర్ 1, 2023 నుండి కొత్త ధరలు అమలులోకి వస్తుంది. అయితే దేశీయ 14.2-కిలోల LPG సిలిండర్ ప్రస్తుత ధరలలో ఎలాంటి మార్పులేదు.
తాజా సవరణ తర్వాత కమర్షియల్ LPG సిలిండర్ ధర 19 కిలోకి న్యూఢిల్లీలో రూ. 1,833, అంతకుముందు రూ. 1,731.5 గా ఉంది, ముంబైలో రూ. 1,785.5, కోల్‌కతాలో రూ. 1,943, చెన్నైలో రూ. 1,999.5.
వంటింటి LPG 14.2 కిలోల సిలిండర్‌కు న్యూఢిల్లీలో రూ. 903, ముంబైలో రూ. 902.5, కోల్‌కతాలో రూ. 929, చెన్నైలో రూ. 918.5గా ఉంది.
గత నెలలో 14 కేజీల ఎల్‌పీజీ సిలిండర్లపై ప్రభుత్వం రిలీఫ్ ఇస్తే, మరో వైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను ఒక నెలలో రూ.300కు పైగా పెంచి పెట్రోలియం కంపెనీలు ద్రవ్యోల్బణం బాంబు పేల్చాయి. అక్టోబర్ 1న కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.209 పెంచగా, నెల రోజుల తర్వాత నవంబర్ 1న మరింత పెంచారు. కోల్‌కతాలో సిలిండర్ ధర అత్యధికంగా రూ.103.50 పెరిగింది.
వంటింటి గ్యాస్ సిలిండర్లపై రిలీఫ్:
పండుగల సీజన్‌లో దీపావళికి ముందు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలపై షాక్ ఇవ్వగా, మరోవైపు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల ధరలపై రిలీఫ్ ఇచ్చింది, అయితే ఈ విషయం మహిళలకు గమనించ తగ్గ విషయం. ప్రతి నెలా ఒకటో తేదీన జరిగే గ్యాస్ ధర సవరణలో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో రక్షాబంధన్ పండుగకు ముందు ఆగస్టు నెలలో వీటి ధరలను రూ.200 తగ్గించి ప్రభుత్వం పెద్ద కానుకగా ఇచ్చింది.
14 కిలోల LPG సిలిండర్
ఆగస్టు 30న నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం వంటింటి గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించగా, ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.400కు పెంచింది. దీని తరువాత కూడా లబ్ధిదారులకు రూ. 100 అదనపు ప్రయోజనం అందించబడింది. ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50.
విమాన ఇంధనం ధర తగ్గింపు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విమాన ఇంధన ధరలను కూడా తగ్గించాయి. వరుసగా మూడుసార్లు పెంపుదల తర్వాత విమాన ఇంధన ధరల పెంపునకు బ్రేక్ పడింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ATF ధర రూ. 1074/KL తగ్గింది. కొత్త ధరలు నేటి (నవంబర్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తగ్గింపు తర్వాత, ప్రజలు గొప్ప ఉపశమనం పొందవచ్చు ఎందుకంటే విమానయాన సంస్థలు విమాన ప్రయాణాన్ని చౌకగా చేయవచ్చు.