MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Jio Phone Next: జియో ఫోన్ నెక్స్ట్ సేల్స్ ప్రారంభం.. ఈజీ ఈఎంఐ ప్లాన్స్ ఇవే.. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Jio Phone Next: జియో ఫోన్ నెక్స్ట్ సేల్స్ ప్రారంభం.. ఈజీ ఈఎంఐ ప్లాన్స్ ఇవే.. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

రిలయన్స్ జియో బడ్జెట్ స్మార్ట్‌‌‌‌ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ (Jio Phone Next) విక్రయాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. గూగుల్,  జియో ఈ మేడ్-ఫర్ ఇండియా స్మార్ట్‌‌ఫోన్‌‌ను తయారు చేశాయి. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేవారు.. స్టోర్ కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా గానీ, జియో డాట్‌‌కామ్‌ (https://www.jio.com/next) ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి.

3 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 07 2021, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రిలయన్స్ జియో బడ్జెట్ స్మార్ట్‌‌‌‌ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ (Jio Phone Next) విక్రయాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. గూగుల్,  జియో ఈ మేడ్-ఫర్ ఇండియా స్మార్ట్‌‌ఫోన్‌‌ను తయారు చేశాయి. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేవారు.. స్టోర్ కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా గానీ, జియో డాట్‌‌కామ్‌ (https://www.jio.com/next) ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి. జియో ఫోన్ నెక్ట్స్ కోసం 70182 70182కు Hi అని వాట్సాప్ చేయడం ద్వారా కూడా కొనుగోలుదారులు వారి ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనేందుకు వీలుండదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా (Jio Phone Next registration) వినియోగదారులు తమ లొకేషన్‌ను షేర్ చేయాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాత స్టోర్ కు వెళ్లి జియో ఫోన్ నెక్స్ట్ కొనుక్కోవాల్సిందిగా వినియోగదారులకు సమాచారం వస్తుంది. ఈ సమాచారం వచ్చిన తరువాత కస్టమర్ జియో ఫోన్ నెక్స్ట్‌ డెలివరీ కోసం సమీపంలోని జియో మార్ట్ రిటైలర్‌ను సందర్శించాలి.

37

జియో ఫోన్ నెక్స్ట్ కొనుగోలు చేసే కస్టమర్ల కోసం రిలయన్స్ ఈఎంఐ ప్లాన్‌లను కూడా అందజేస్తుంది. ఫోన్ ధర రూ. 6,499.. కాగా, వినియోగదారులు సులభంగా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందులో వినియోగదారులు తొలుతు రూ. 1,999 చెల్లించాలి (రూ. 501 ప్రాసెసింగ్ ఫీజు అదనం). మిగిలిన మొత్తాన్ని సులభంగా నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఫోన్ ను తీసుకునేందుకు ఒకటి లేదా రెండు రోజుల తరువాత రావాల్సిందిగా చెప్పే అవకాశం ఉంటుంది.
 

47

జియో ఫోన్ నెక్స్ట్ కు సులభ యాక్సెస్ ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా కంపెనీ 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేపర్ లెస్ డిజిటల్ ఫైనాన్స్ ఆప్షన్ ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. జియో ఫోన్ నెక్ట్స్ కోసం రూ.1,999 చెల్లిస్తే.. వినియోగదారులు జియో అందించే దిగువ ఈఎంఐ ప్లాన్స్‌లో దేనినైనా ఎంచుకోవచ్చు..

57

ఆల్వేస్ ఆన్ ప్లాన్- నెలకు రూ. 300 చొప్పున 24 నెలలు / నెలకు రూ. 350 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా... నెలకు 5 జిబి డేటా, 100 నిమిషాల కాలింగ్ పొందవచ్చు

లార్జ్ ప్లాన్- నెలకు రూ. 450 చొప్పున 24 / నెలకు రూ. 500 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా.. రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్ పొందవచ్చు.

XL ప్లాన్-  నెలకు రూ. 500 చొప్పున 24 నెలలు / నెలకు రూ. 550 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా.. రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్ పొందవచ్చు.

XXL ప్లాన్- నెలకు రూ. 550 చొప్పున 24 నెలలు / నెలకు రూ. 600 చొప్పున 18 నెలలు చెల్లించడం ద్వారా.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్ పొందవచ్చు.

67

జియో ఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్.. జియో ఫోన్ నెక్స్ట్ అనేది ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. భారతదేశం కోసం తీర్చి దిద్దబడిన ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్. ఇది 5.45 అంగుళాల హెచ్ డి+ (720x1,440 pixels) డిస్ ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ తో వస్తుంది. యాంటీ - ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. కెమెరా వి భాగంలో జియో ఫోన్ నెక్స్ట్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. రియర్ కెమెరాలో పోట్రాయిట్ మోడ్, నైట్ మోడ్, ప్రి లోడెడ్ కస్టమ్ ఇండియా- అగుమెంటెడ్ రియాలిటీ ఫిల్టర్స్ ఉంటాయి. 
 

77

ఈ ఫోన్ 1.3 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 క్వాడ్ - కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకోగలిగిన 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగిఉంటుంది. జియో ఫోన్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మైక్రో - యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూ టూత్ వీ4.1, వై-పై, డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్స్ ఉంటాయి. జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్స్ ను పొందుతుంది. రీడ్ అలౌడ్, లైవ్ ట్రాన్స్ లేట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఊగిసలాడుతున్న పసిడి..రోజుకో రేటుతో గోల్డ్ మార్కెట్‌లో టెన్షన్
Recommended image2
ఐఫోన్ డ్యూయో కొనే బదులు ఇలా చేస్తే.. నెలకు రూ. 30 వేల ఆదాయం ఖాయం
Recommended image3
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved