Ban on Rs500: కొన్ని నెలల్లో రూ.500 నోట్లను ఆర్బీఐ రద్దు చేయబోతోందా?
Ban on Rs500: వెయ్యి రూపాయల నోట్లు, రెండు వేల రూపాయల నోట్లు రద్దయిపోయాయి. ఇప్పుడు రూ.500 నోట్లు కూడా రద్దవుతాయనే వాదన కొంతమందిలో ఉంది. ఇప్పుడు ఈ వార్త ప్రజల్లో ఆందోళనను పెంచుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి.

రూ.500 నోట్లు రద్దవుతాయా?
సోషల్ మీడియాలో 500 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో రద్దు చేస్తోందనే వార్తలు వైరల్ అయిపోతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియాలో ఇది అధికంగా షేర్ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రచారంలో నిజం ఎంత? ఆర్బీఐ లేదా కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లు రద్దు చేయాలనుకుంటుందా? అనే విషయాలను తెలుసుకుందాం.
ఆర్బీఐ ఏం చెప్పింది?
పెద్ద నోట్లు రద్దు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐ కు మాత్రమే ఉంటుంది. గతంలో 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. ఆ తరువాత 2000 నోట్ల రూపాయలను అమలులోకి తెచ్చారు. ఇప్పుడు వాటిని కూడా చలామణిలో లేకుండా నిషేధించారు. ఇక మిగిలిన పెద్ద నోటు 500 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఆ నోట్లను కూడా రద్దు చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ కూడా కేవలం అపోహలేనని నిర్ధారించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) చెబుతున్న ప్రకారం ఆర్బీఐ ఇప్పటివరకు 500 రూపాయల నోట్లు రద్దు చేసే ఆలోచనలో లేదు. దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు అని చెబుతోంది. ఎలాంటి అధికారిక ఆదేశాలు ఇవ్వకుండా 500 రూపాయల నోట్లు రద్దు చేయడం జరగదని నిర్ధారించింది.
కారణం ఇదే
సోషల్ మీడియాలో 500 రూపాయల నోట్లు మార్చి నుంచి ఏటీఎం ద్వారా ఇక రావని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆర్పిఐ ఏటీఎంలలో అధికంగా 100 లేదా 200 రూపాయల నోట్లను ఉంచాలని ఒక సర్య్కులర్ జారీ చేసింది. కానీ 500 రూపాయల నోట్లు పూర్తిగా ఆపివేయమని మాత్రం చెప్పలేదు. కొంతమంది 100, 200 నోట్లు అధికంగా వస్తుండడంతో 500 రూపాయల నోట్లను రద్దు చేస్తారని అపోహ కలిగి ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి. 2026లో 500 రూపాయల నోట్లు రద్దయిపోతాయని యూట్యూబ్ వీడియోలని కూడా చేశారు. కానీ వాటిలో ఎలాంటి నిజము లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చి చెప్పింది.
రద్దు చేస్తారా?
ఒకవేళ 500 రూపాయల నోట్లు రద్దు చేయాలనుకుంటే ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బిఐ అధికారికంగా ప్రకటిస్తుంది. ఇందుకోసం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ దేశంలోని ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అంతేకానీ హఠాత్తుగా 500 రూపాయల నోట్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలన్నీ పూర్తిగా అపోహలేనని, వీటిని నమ్మాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

