- Home
- Business
- iPhone 16e: ఐఫోన్ 16e ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. ధర కూడా తక్కువే.. వెంటనే బుక్ చేసుకోండి
iPhone 16e: ఐఫోన్ 16e ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. ధర కూడా తక్కువే.. వెంటనే బుక్ చేసుకోండి
iPhone 16e: మీరు ఐఫోన్ 16e కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. ఐఫోన్ కొత్త సిరీస్ 16e ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఇవి మార్కెట్ లోకి అందుబాటులోకి కూడా వచ్చేస్తాయి. అందరికంటే ముందు మీరే ఈ రోజే ప్రీ ఆర్డర్ చేసుకోండి. కొత్త సిరీస్ ఫీచర్లు, ధరలు ఒకసారి పరిశీలిద్దాం రండి.

ఐఫోన్ 16e మీ చేతుల్లోకి రావడానికి ఎంతో కాలం లేదు. ఫిబ్రవరి 21 నుంచి ఈ ఫోన్ కు సంబంధించిన ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఆపిల్ నుండి వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ లాగే పని చేస్తుంది. అయితే దీని ధర తక్కువగా ఉండటం వినియోగదారులకు కలిసొచ్చే విషయం.
ఐఫోన్ 16e స్టోరేజ్, రంగులు, కేసులు
ఐఫోన్ 16e మూడు స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంది. అవి 128 GB, 256 GB, 512 GB. ఇది వింటర్ బ్లూ, ఫ్యూషియా, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తుంది.
iPhone 16e: ధర
ఐఫోన్ 16e 256GB మోడల్ ధర రూ. 69,900 ఉంది. అదే 512GB మోడల్ ధర అయితే రూ. 89,900. 128 GB స్టోరేజ్ తో బేస్ మోడల్ ధర రూ. 59,900 మాత్రమే. ఈ ఫోన్ ఫిబ్రవరి 28 నుంచి మార్కెట్ లో అమ్మకానికి వస్తుంది. ఐఫోన్ 16e కొనాలనుకుంటే మీరు ఈఎంఐలు చెల్లించి కూడా కొనుగోలు చేయొచ్చు. 128 GB, 256 GB, 512 GB మోడల్స్ ఈఎంఐలు వరుసగా రూ. 2,496, రూ. 2,912, రూ. 3,746 నుంచి ప్రారంభమవుతాయి.
ఇతర ఐఫోన్ల మాదిరిగానే, ఆపిల్ కేర్+ ను మీ కొత్త ఫోన్ కొన్న 60 రోజుల్లోపు లేదా ఫోన్‌తో పాటు కొనుగోలు చేస్తే ఫోన్, బ్యాటరీ, కేబుల్స్ కి రెండేళ్ల రీప్లేస్‌మెంట్ కవరేజ్ ఆఫర్ లభిస్తుంది. ఇతర డ్యామేజ్‌లకు రూ. 8,900, స్క్రీన్, బ్లాక్ గ్లాస్‌కు రూ. 2,500 చెల్లించాలి.
ఐఫోన్ 16e కోసం ఆపిల్ కేర్+ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 10,900గా ఉంది. కావాలంటే మీరు దీన్ని వాయిదాలలో కూడా చెల్లించవచ్చు.
ఆపిల్ కొత్త కస్టమర్‌లకు అదనంగా ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ TV+, ఆపిల్ ఆర్కేడ్, ఆపిల్ న్యూస్+, ఆపిల్ ఫిట్ నెస్+ లను మూడు నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.
మీరు క్రెడిట్ కార్డుతో ఐఫోన్16e కొనుగోలు చేస్తే ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, SBIతో కలిసి రూ. 4,000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. దీనితో పాటు వినియోగదారులు రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.