మీకు ఎమర్జెన్సీగా మనీ కావాలా..అయితే ఆధార్ కార్డు ఉంటే చాలు!
ఆధార్ ఆధారంగా వెంటనే రూ.5,000 రుణం పొందొచ్చు. e-KYC పూర్తి చేసి డబ్బును నేరుగా ఖాతాలోకి పొందే విధానం తెలుసుకోండి.
- FB
- TW
- Linkdin
Follow Us

క్షణాల్లో రుణం
మనకు రోజూ ఏదోక రూపంలో డబ్బు అవసరం ఉంటునే ఉంటుంది. కొన్నిసార్లు మన దగ్గర మనీ లేకపోతే...ఫ్రెండ్స్ నో,చుట్టాలనో అడిగి చేబదులు తీసుకుంటాం. కానీ ఇప్పుడు అలా ఇంకొకరిని అడిగే పరిస్థితులు లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు..క్షణాల్లో రుణాన్ని పొందవచ్చు.అయితే పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో అప్పటికప్పుడు అవసరాలను తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారబోతోంది.
ఆధార్ ఆధారంగా రుణాలు
ఆర్థిక సాంకేతికత రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులతో, ఎన్నో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs) ఇప్పుడు ఆధార్ ఆధారంగా తక్షణ రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ఆధారంగా ఉండడం వల్ల, మొబైల్ లేదా లాప్‌టాప్‌తో ఇంటి నుంచే రిజిస్టర్ చేసుకోవచ్చు.వివరాల్లోకి వెళితే, రూ.5,000 వరకు తక్షణ రుణం పొందాలంటే మీ వద్ద ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది. ఈ మూడు ప్రధాన డాక్యుమెంట్లను ఉపయోగించి మీ e-KYC పూర్తవుతుంది. దాంతో పాటు, కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలి. అలాగే, ఆదాయాన్ని నిరూపించే కొన్ని సాధారణ డాక్యుమెంట్లు కూడా అవసరం ఉంటుంది.
ఆధార్ నంబర్, పాన్ డీటెయిల్స్
దరఖాస్తు చేసే విధానం కూడా చాలా సులభం. మొదట మీకు నచ్చిన రుణ యాప్ లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి, రిజిస్ట్రేషన్ చేయాలి. అందులో మీ పేరు, ఆధార్ నంబర్, పాన్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా ధృవీకరణ జరిగి, ఆధార్, పాన్ ఆధారంగా e-KYC పూర్తవుతుంది.దీని తర్వాత మీరు అర్హత సాధిస్తే, యాప్‌లో మీరు పొందగలిగే లోన్ ఆఫర్ కనిపిస్తుంది. దానిలోని షరతులు చదివి, అంగీకరిస్తే, దరఖాస్తును సమర్పించవచ్చు. ఆమోదం లభించిన వెంటనే, మొత్తం డబ్బును నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు.
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు
ఈ రుణాల కోసం ప్రత్యేకంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ రకమైన సదుపాయాలను ఇప్పుడు KreditBee, MoneyView, mPokket, Pocketly వంటి యాప్‌లు అందిస్తున్నాయి. అయితే, ఇలాంటి యాప్‌లు RBI వద్ద రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయా లేదా అనే విషయాన్ని తప్పకుండా తనిఖీ చేయాలి.
15 శాతం నుంచి 36 శాతం
ఇప్పుడు వడ్డీ రేట్లు గురించి చెప్పుకుంటే, ఈ తక్కువ మొత్తపు తక్షణ రుణాలకు వార్షికంగా 15 శాతం నుంచి 36 శాతం వరకు వడ్డీ ఉండే అవకాశం ఉంది. కాలపరిమితి సాధారణంగా మూడు నెలల నుండి ఆరు నెలల మధ్యగా ఉంటుంది. వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగితే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల, EMI చెల్లింపులను సమయానికి చేయడం చాలా ముఖ్యం.వాయిదాలు చెల్లించడానికి యాప్‌లు ఆటో డెబిట్ లేదా NACH ఫారమ్ వంటి సదుపాయాలను కూడా అందిస్తున్నాయి. ఇవి బాకీలను మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డెడక్ట్ చేస్తాయి.
క్రెడిట్ కార్డు లేనివారికి
ఈ విధానం క్రెడిట్ కార్డు లేనివారికి, లేదా పెద్ద బ్యాంకుల రుణాల కోసం ఎదురు చూస్తున్నవారికి చక్కటి మార్గంగా నిలుస్తోంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో తక్కువ మొత్తం డబ్బు అవసరమైనప్పుడు ఇది చాలా ఉపయుక్తం. అయితే దీనిని తరచూ వినియోగించడం మానేయాలి. ఒకసారి అలవాటు పడితే, అప్పుల బారిన పడే ప్రమాదం ఉంది.ఈ చిన్న రుణాలను తీసుకుని, వాటి EMIలను సకాలంలో చెల్లించడం వలన మీరు మీ క్రెడిట్ చరిత్రను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది.
ఆధార్ ఆధారంగా లోన్ తీసుకోవచ్చా?
మరికొంతమంది పాన్ కార్డ్ లేకుండానే ఆధార్ ఆధారంగా లోన్ తీసుకోవచ్చా? అనే సందేహం కలిగి ఉంటారు. అయితే, చాలా NBFCలు ఇరు డాక్యుమెంట్లు తప్పనిసరిగా అడుగుతాయి. కాబట్టి, ముందుగానే పాన్ తయారుచేసుకుని పెట్టుకోవడం మంచిది.ఇంకా, రూ.5,000 లోన్ కోసం కూడా NBFCలు క్రెడిట్ చెక్ చేస్తాయి. మీరు గతంలో తీసుకున్న రుణాల చెల్లింపులు, క్రెడిట్ స్కోర్ మొదలైన వివరాలను పరిశీలించి, ఆమోదిస్తారు. క్రెడిట్ చెక్ తప్పనిసరి ప్రక్రియగా తీసుకుంటారు.
ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్
ఈ తక్షణ రుణ సదుపాయాన్ని ఇప్పుడు అందిస్తున్న యాప్‌లు: KreditBee, MoneyView, mPokket, Pocketly. అయితే, ఏ యాప్ నుంచి అయినా రుణం తీసుకునే ముందు, వారి నిబంధనలు చదవడం, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించడం చాలా అవసరం.ఇక చివరిగా చెప్పుకోవలసింది ఏమంటే, ఆధార్ ఆధారంగా తక్షణంగా లభించే ఈ చిన్న రుణాలు అత్యవసర సమయంలో మంచి సహాయం చేస్తాయి. కానీ దీన్ని ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌కు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. జాగ్రత్తగా, అవగాహనతో ఉపయోగించుకుంటేనే దీని ప్రయోజనం పూర్తిగా పొందగలుగుతారు.