- Home
- Business
- Bank Calls: హమ్మయ్యా.. ఫ్రాడ్ కాల్స్‌కు చెక్, ఇకపై బ్యాంక్ కాల్స్ ఈ కొత్త నెంబర్ సిరీస్ నుంచే వస్తాయి
Bank Calls: హమ్మయ్యా.. ఫ్రాడ్ కాల్స్‌కు చెక్, ఇకపై బ్యాంక్ కాల్స్ ఈ కొత్త నెంబర్ సిరీస్ నుంచే వస్తాయి
+ 91 సిరీస్ నంబర్లతో కాకుండా వేరే ఏ నంబర్ సిరీస్ తో కాల్స్ వచ్చినా స్పామ్ కాల్స్ అనుకొని లిఫ్ట్ చేయడం లేదా? అందులో మీకు అవసరమైన బ్యాంకు కాల్స్ కూడా ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్ సమాచారాన్ని మీకు తెలియడానికి ఫోన్ చేయొచ్చు. మరి అవి బ్యాంకు కాల్సా? లేక ప్రకటనలు తెలిపే కాల్సా? లేక ఫ్రాడ్ కాల్సా? ఎలా తెలుసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారంగా టెలికాం శాఖ బ్యాంకులకు ప్రత్యేక నంబర్ సిరీస్ ను కేటాయించింది. అదేంటో తెలుసుకుందాం రండి.

ఈ మధ్య ఫ్రాడ్ కాల్స్ ఎక్కువైపోయాయి కదా.. రకరకాల నంబర్ సిరీస్ నుంచి ఫోన్ చేసి మాయమాటలతో మన అకౌంట్లో డబ్బులు దోచేస్తున్నారు. అయితే ఇలాంటి కొత్త నెంబర్ సిరీస్ లోనే బ్యాంకుకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలిపే ఫోన్ కాల్స్ కూడా ఉంటాయి. మోసగాళ్ల భయంతో బ్యాంకులందిస్తున్న ఆఫర్లు, ఇతర విలువైన సమాచారాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుండి టెలికాం శాఖ చక్కటి పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదేంటో చూద్దాం రండి.
సొసైటీలో జరుగుతున్న మోసాల్లో చాలా రకాలు ఉన్నాయి. దొంగతనాలు, దారి దోపిడీలు, అప్పు తీసుకునే ఎగ్గొట్టడం, జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి పరారైపోవడం ఇలా ఎన్నో రకాలుగా మోసం జరుగుతున్నాయి. ఇలాంటి వాటి గురించి ప్రజలు అప్రమత్తంగా ఉన్నా, ఇప్పుడు ఆన్ లైన్ లో కొత్త రకాల మోసాలు మొదలయ్యాయి. ఫోన్లకు లింక్స్ పంపించు ఓపెన్ చేయమని చెప్పి, బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేస్తున్నారు. అలాగే ఓటిపిలు పంపించే వాటి ద్వారా కూడా బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు మొత్తం దోచేస్తున్నారు.
బ్యాంకుల్లో జరుగుతున్న ఇలాంటి కొత్త రకాల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా బ్యాంకుల అందిస్తున్న కొత్త స్కీమ్స్, వడ్డీ రేట్లు, లోన్స్ తదితర అప్డేటెడ్ విషయాలు చెప్పడానికి బ్యాంకులు తమ కస్టమర్లకు ఫోన్ చేస్తారు. దీనికోసం ఇప్పటి వరకు బ్యాంకులు +140 నంబర్ సిరీస్ నుంచి తమ కస్టమర్లకు కాల్స్ చేస్తాయి. ఈ విషయం తెలియక వినియోగదారులు అవి యాడ్స్ కి సంబంధించిన విషయాలు తెలిపే కాల్స్ అనుకోవడం, స్కామర్లు కాల్ చేస్తున్నారని భయపడి చాలామంది కాల్ ఎత్తడం లేదు.
అయితే ఇది స్పాన్ కాల్స్ అనుకుని చాలామంది కష్టమర్లు ఫోన్లు ఎత్తడం లేదు. దీంతో వారికి విలువైన సమాచారం చేరడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని టెలికాం శాఖ బ్యాంక్ కాల్స్ కోసం ఒక ప్రత్యేక నంబర్ సిరీస్ ని కేటాయించింది. తాము అందిస్తున్న సేవల గురించి వినియోగదారులకు తెలియజేయడానికి బ్యాంకులు ఇకపై +160 సిరీస్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
అదేవిధంగా క్రెడిట్ కార్డ్, లోన్ ఆఫర్స్, ఇలాంటి సేవలు గురించి తెలియజేయడానికి బ్యాంకులు +161 సిరీస్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. +140 సిరీస్ ఉపయోగించి వినియోగదారులకు ఫోన్ చేసి అడ్వటైజింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ త్వరలో అమలు కానున్నాయి.