సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్.. ఇకపై లోయర్ బెర్త్ టెన్షన్ ఉండదు.
ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు ఎన్నో రాయితీలు కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఐఆర్‌సిటిసి కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనం జరగనుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణాలు రైల్వే సేలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలో ఎక్కువ మంది ఉపయోగించే రవాణా సాధనాల్లో రైల్వే మొదటి స్థానంలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దూరప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే వారు రైల్వేకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే వాఖ కూడా ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక వృద్ధుల కోసం లోయర్ బెర్త్ లాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో లోయర్ బెర్త్ బుక్ చేసుకున్నా లభించని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే
సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణం సులభతరం చేయడానికి ఇండియన్ రైల్వే కొన్ని నియమాలను అమలు చేస్తుంది. వీటిలో ప్రయాణికులకు లోయర్ బెర్త్ కేటాయించడం ఒకటి. సాధారణంగా వృద్ధులు పైకి ఎక్కడం ఇబ్బంది కలుగుతుంది. అందుకే లోయర్ బెర్త్ కు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఐఆర్సీటీసీ కూడా సీనియర్ సిటిజన్లకు అవకాశం కల్పించింది. రైల్వే టికెట్ బుక్ చేసుకునేప్పుడు లోయర్ బెర్త్ కోసం అభ్యర్థించే అవకాశాన్ని కల్పించింది.
లోయర్ బెర్త్
అయితే కొన్ని సందర్భాల్లో సీనియర్ సిటీజన్లకు కూడా లోయర్ బెర్త్ లు లభించని పరిస్థితి ఉంటుంది. పెద్దలకు కూడా అప్పర్ బెర్త్ వస్తుంటాయి. అయితే దీనిపై ఇండియర్ రైల్వే ఓ వివరణ ఇచ్చింది. దీని ప్రకారం జనరల్ కోటాలో టికెట్ బుక్ చేసేవారికి ఖాళీలున్న బెర్త్‌లే ఇస్తామని తెలిపింది. బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ అందుబాటులో ఉండకపోతే సీట్లు లభించవు.
సీనియర్ సిటిజన్లు
లోయర్ బెర్త్ దొరికే అవకాశం పెంచుకోవడానికి, టికెట్ బుక్ చేసేటప్పుడు 'ప్రిఫరెన్స్ ఆప్షన్' ఎంచుకోవాలి. లోయర్ బెర్త్ ఉంటేనే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే బుకింగ్ జరగదు. ముందు వచ్చిన వారికి ముందు అనే విధానంలో లోయర్ బెర్త్ కేటాయిస్తారు.
లోయర్ బెర్త్ కేటాయింపు
అయితే సీట్ల కేటాయింపు విషయంలో ఎలాంటి ప్రమోయం లేకుండా సిస్టమ్ జనరేట్ ఆధారంగా కేటాయిస్తారు. జనరల్ కోటాలో లోయర్ బెర్త్ లేకపోతే, టిటిఇని సంప్రదించవచ్చు. ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఖాళీ ఉంటే టిటిఇ కేటాయిస్తారు. ఇలా వృద్ధులకు లోయర్ బెర్త్ దొరికే అవకాశం ఉంటుంది.
బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే.. ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వస్తాయా.? అసలు విషయం ఏంటంటే..