MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • సామాన్యులకు మంచి రోజులొచ్చాయ్.! ఇక జనరల్ కూడా ఏసీ కోచ్‌ల మాదిరిగా..

సామాన్యులకు మంచి రోజులొచ్చాయ్.! ఇక జనరల్ కూడా ఏసీ కోచ్‌ల మాదిరిగా..

Railways: సాధారణ ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చేలా, భారత రైల్వే జనరల్ కోచ్‌లలో AC కోచ్‌ల మాదిరిగానే క్లీనింగ్ సౌకర్యాలను అందించాలని నిర్ణయించింది. '52 వారాలు - 52 సంస్కరణలు' ప్రణాళికలో భాగంగా..  

2 Min read
Author : Pavithra D
Published : Feb 16 2026, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జనరల్ కోచ్ లలో ప్రయాణించేవారికి
Image Credit : Indian Railways

జనరల్ కోచ్ లలో ప్రయాణించేవారికి

భారతీయ రైల్వే తన లక్షలాది మంది ప్రయాణికులకు.. మరీ ముఖ్యంగా జనరల్ కోచ్ లలో ప్రయాణించేవారికి పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటివరకు ఫస్ట్-క్లాస్, AC కోచ్‌లలో శుభ్రపరిచే ప్రక్రియను ఇకపై జనరల్ కంపార్ట్‌మెంట్లలోనూ చేయనున్నారు. జనరల్ లో ప్రయాణించే ప్రయాణికులు ఇక మురికి, దుర్వాసన మధ్య ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. సామాన్యుల ప్రయాణాన్ని మరింత సౌలభ్యం చేసేందుకు 'సంస్కరణ ప్రణాళిక 2026' కింద రైల్వేలు సిద్ధమయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జనరల్ కోచ్‌ల శుభ్రపరచడంపై ప్రత్యేక దృష్టి
Image Credit : Indian Railways

జనరల్ కోచ్‌ల శుభ్రపరచడంపై ప్రత్యేక దృష్టి

రైల్వే ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించింది. దీని కింద వచ్చే ఏడాది లేదా 52 వారాలలో 52 ప్రధాన సంస్కరణలు అమలు చేయనుంది. దీని ప్రకారం, రైలులోని ప్రతి కోచ్ ను ఇప్పుడు ప్రయాణ సమయంలోనే శుభ్రం చేయనున్నారు. ముఖ్యంగా, ఈ శుభ్రత డ్రైవ్‌లో జనరల్ కోచ్‌లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

35
ఇతర కంపార్ట్ మెంట్లతో అనుసంధానం
Image Credit : Indian Railways

ఇతర కంపార్ట్ మెంట్లతో అనుసంధానం

జనరల్ కోచ్‌లు సాధారణంగా ఇతర కంపార్ట్ మెంట్లతో అనుసంధానం అయ్యి ఉండవు. దీనివల్ల రైలు కదులుతున్నప్పుడు శుభ్రపరిచే సిబ్బంది వాటిని చేరుకోవడం కష్టమవుతుంది. అందుకే ఇప్పుడు స్టేషన్లలో ఆగినప్పుడు శుభ్రపరిచే సిబ్బంది జనరల్ కోచ్‌లలోకి ఎక్కి టాయిలెట్లు, డస్ట్‌బిన్‌లు, కోచ్‌లను పూర్తిగా శుభ్రపరచనున్నారు. ప్రారంభంలో, ప్రతి జోన్‌లో 4-5 రైళ్లను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత క్రమంగా 80 రైళ్లలో అమలు చేస్తారు.

45
శుభ్రపరచడంలో అలసత్వం లేదు..
Image Credit : Indian Railways

శుభ్రపరచడంలో అలసత్వం లేదు..

రైల్వే ఇకపై శుభ్రపరిచే వ్యవస్థను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనుంది. శుభ్రపరిచిన తర్వాత కోచ్‌ల ఫోటోలు ఇప్పుడు నేరుగా కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి. అక్కడ AI- ఆధారిత వ్యవస్థ ప్రమాణాల ప్రకారం శుభ్రపరచడం జరిగిందని కన్ఫర్మ్ చేస్తారు. పరిశుభ్రతలో ఏవైనా లోపాలు కనిపిస్తే, సంబంధిత కాంట్రాక్టర్‌పై తక్షణ చర్యలు తీసుకుంటారు. భవిష్యత్తులో పర్ఫెక్ట్ పర్సన్స్ కి మాత్రమే కాంట్రాక్టులు ఇస్తామని రైల్వే స్పష్టం చేసింది. రద్దీ సమయాలను లెక్కించడానికి, ఎక్కువ మంది సిబ్బందిని నియమిస్తారు. బృందాలు రూట్ వారీగా పనిచేస్తాయి.

55
కార్గో టెర్మినల్స్ కొత్త ఆదాయాన్ని సృష్టిస్తాయి
Image Credit : Indian Railways

కార్గో టెర్మినల్స్ కొత్త ఆదాయాన్ని సృష్టిస్తాయి

ప్రయాణికుల సౌకర్యమే కాకుండా, రైల్వే దాని ఆదాయం, కార్గో నిర్వహణకు సంబంధించి కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. గతి శక్తి కార్గో టెర్మినల్స్ కాంట్రాక్ట్ కాలపరిమితిని 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది. ఈ మార్పు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని.. దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని పేర్కొంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి
Recommended image2
Business Ideas: రూ. 2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 30 వేల ఆదాయం.. ఉన్న ఊరిలో ఉండే సంపాద‌న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved