Gold Rates: మూడు రోజుల్లోనే రూ.6000 పెరిగిన తులం బంగారం, బ్రేకులు ఎప్పుడు పడతాయో
బంగారం ధర (Gold rates) ఎవరూ ఊహించని స్పీడ్ తోపెరిగిపోతోంది. మూడు రోజుల్లోనే 10 గ్రాములపై 6000 రూపాయలు పెరిగింది. ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పుకోవాలి. దీపావళికి బంగారం ఎక్కువ అమ్ముడయ్యే అవకాశం ఉంది.

ప్రతిరోజూ పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ఆరువేల రూపాయలు పెరిగింది. ఈమధ్య పెరిగిన ధరల్లో ఇది అత్యధిక పెరుగుదలగా చెప్పుకోవాలి. దీపావళికి 10 గ్రాముల బంగారం రూ. 1,25,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు నిపుణఉలు. కానీ ఇంకా ముందే ఆ ధరకు బంగారు చేరుకోవచ్చేమో అనిపిస్తుంది.
ప్రస్తుత బంగారం ధర
బుధవారం న్యూఢిల్లీలోని బులియన్ మార్కెట్లో బంగారం ధర ఒక్కరోజే 2600 రూపాయలు పెరిగి.. 10 గ్రాముల బంగారం రూ. 1,26,600 దగ్గర ఆగింది. ఇది ఆల్ టైం గరిష్ట స్థాయి ధర అని చెప్పుకోవచ్చు.
దీపావళికి బంగారం అమ్మకాలు
ఈ ఏడాది దీపావళికి బంగారం అమ్మకాలు విపరీతంగా జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం దీపావళి సందర్భంగా దాదాపు 45 టన్నుల బంగారం అమ్ముడయ్యే అవకాశం ఉందని అంచనా. ఇదే జరిగితే ఆల్ టైం రికార్డు అని చెప్పుకోవాలి. కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరగడమే గాని తగ్గడం లేదు. అయినా కూడా నగల షోరూమ్ వద్ద ప్రతి విపరీతంగానే ఉంటుంది.
ఎందుకు బంగారం పెరుగుతోంది?
బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య బలహీనతలు, అమెరికా సుంకాలు, పెరుగుతున్న డిమాండ్, రూపాయి విలువ పడిపోవడం వంటివన్నీ కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే మన దేశంలో బంగారానికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. డిమాండ్ వల్ల ధర ఎంత పెరుగుతున్నా కూడా కొనే వారి సంఖ్య తగ్గడం లేదు. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి అతి ముఖ్యమైన కారణాలు గానే చెప్పుకోవాలి.