MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఐటీ రైడ్ ఖాయం!

ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఐటీ రైడ్ ఖాయం!

Income Tax Department: మనం రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా.. అయితే లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని విషయాలు పట్టించుకోం. అదే మన కొంప ముంచుతుంది. మీరు చేసే చిన్న తప్పుల వల్ల ఐటీ రైడ్స్ లేదా నోటీసులు అందుకొనే ఛాన్స్ కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 01 2025, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ డిజిటల్ లావాదేవీల కాలంలో కూడా చాలామంది నగదును ఇష్టపడతారు. ఇలా నగదు మెయింటైన్ చేసేవాళ్లు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. వాటి వల్ల ఆదాయపు పన్ను శాఖ మీపై దృష్టి పెడుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలని కొంతమంది ఆదాయపు పన్ను శాఖ కన్నుగప్పడానికి నగదు లావాదేవీలు చేస్తారు. చిన్న మొత్తంలో కొనుగోళ్లు చేస్తే పెద్ద సమస్య కాదు. కానీ కొన్ని ఎక్కువ విలువైన లావాదేవీలు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకొనేలా చేస్తాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

సాధారణంగా చాలా మంది ఈ పని చేస్తారు. బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేస్తారు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకు ఐటీ శాఖకు తెలియజేయాలి. అలా చేయకపోతే ఫైన్ పడుతుంది. ఇది సింగిల్, మల్టిపుల్ ఖాతాలకు కూడా వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త వడ్డీ రేట్లు: సుకన్య సమృద్ధి నుంచి పీపీఎఫ్ వరకు పూర్తి వివరాలు ఇవిగో

34

ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు సాధారణంగా మీరు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లిస్తే, రిజిస్ట్రార్ ట్యాక్స్ అధికారులకు తెలియజేయాలి. లేకపోతే మీకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి నోటీసులు అందుతాయి. మీరు సక్రమమైన మార్గంలోనే ఆ ఆస్తిని సంపాదించామని ఆధారాలు చూపకపోతే మీరు చట్టపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో బ్లాక్ మనీ వాడకుండా చూడటానికే అధికారులు ఈ క్రాస్ చెకింగ్ చేస్తుంటారు. 

44

చివరగా క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా పెట్టుబడులకు పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం కూడా ఆదాయపు పన్ను శాఖ పరిశీలనకు వస్తుంది. అంటే ప్రస్తుత రోజుల్లో అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా.. వాటిని చేస్తే ఎలాంటి సమస్యలు రావు. కాని భారీ మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే అధికారుల నుంచి నోటీసులు అందుకోక తప్పదు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బ్యాంకు ద్వారా లావాదేవీలు చేయడం మంచిది.

ఇది కూడా చదవండి మూడు రోజుల్లోనే పీఎఫ్ డబ్బులు మీ ఖాతాల్లోకి.. EPFO కొత్త మార్పులు: ఏప్రిల్ 1, 2025 నుండి అమలు

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
స్థిరాస్తి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Recommended image2
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image3
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved