cars
టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 19 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
టాటా టియాగోలో 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 84.8 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది.
రెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది రెండు రంగుల్లో దొరుకుతుంది.
క్విడ్‌లో 0.8-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 53 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. దీని మైలేజ్ 22 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 6 వేరియంట్లలో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.
ఎస్-ప్రెస్సోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 66 బీహెచ్‌పీ పవర్ ఇస్తుంది. దీని మైలేజ్ 24.12 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
మారుతి ఎంట్రీ-లెవెల్ మోడల్ ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.23 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.
మారుతి ఆల్టో పెట్రోల్ MT మోడల్ లీటరుకు 24.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.