Yamaha Bikes: వామ్మో.. యమహా బైక్స్ పై రూ.లక్షకు పైగా డిస్కౌంటా? ఆఫర్ అదిరిపోయిందిగా..
Yamaha Bikes: మీకు యమహా బైక్స్ అంటే ఇష్టమా? అయితే మీకు ఇది శుభవార్తే. Yamaha కంపెనీ ఇండియాలో లాంచ్ చేసిన బైక్‌లపై రూ.లక్షకు పైగా డిస్కౌంట్ ప్రకటించింది. ఆ బైక్స్, మోడల్స్, ఫీచర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి.

Yamaha కంపెనీ తన R3, MT 03 బైక్‌ల ధరలను రూ.1.10 లక్షలు తగ్గించింది. దీని ప్రకారం R3 కొత్త ధర రూ.3.60 లక్షలు. MT 03 కొత్త ధర రూ.3.50 లక్షలు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ బంపర్ ఆఫర్ ను మీరు కూడా పొందాలనుకుంటే మీకు దగ్గర్లోని యమహా షోరూమ్ కి గాని, మీ సమీపంలోని యమహా డీలర్ దగ్గరకు గాని వెళ్లి పూర్తి వివరాలు కనుక్కోండి.
Yamaha R3
Yamaha R3 బైక్ అదనపు ఫీచర్లతో వస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా డ్యూయల్-ఛానల్ ABS, LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్‌తో హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ అమర్చారు. ఈ బైక్ KTM RC 390, నింజా 400లకు పోటీగా నిలుస్తోది.
Yamaha MT-03
ఈ బైక్ 1 వేరియంట్ లో వస్తోంది. అయితే 2 రంగుల్లో లభిస్తుంది. యమహా MT-03 ఫీచర్స్ విషయానికొస్తే 321cc BS6 ఇంజన్, 41.4 bhp పవర్, 29.5 Nm టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో యమహా MT-03 యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ MT-03 బైక్ 167 కిలోల బరువు ఉంటుంది. 14 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది.
Yamaha R3, MT-03 బైక్‌లు ఫీచర్లు ఇవి..
321 cc పారలల్-ట్విన్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్, KYB USD ఫోర్కులు, మోనోషాక్, డ్యూయల్ ఛానల్ ABS, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.