రూ. 6210 కోట్ల విలువైన ఆస్తులను ఉద్యోగులకు రాసిచ్చేసిన యజమాని ఎవరో తెలిస్తే షాక్ తినడం ఖాయం...
ఫైనాన్స్ రంగం పట్ల అవగాహన ఉన్న వారికి శ్రీరామ్ గ్రూప్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆ గ్రూపు వ్యవస్థాపకుడు ఆర్. త్యాగరాజన్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు...తాజాగా ఆయన తన ఆస్తులన్నీ కంపెనీ ఉద్యోగులకు దానం చేయడం ద్వారా, సమకాలీన భారతదేశంలో ఆయన గొప్ప దాతగా పేరు సంపాదించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఈ.ఆర్. త్యాగరాజన్ శ్రీరామ్ ఫైనాన్స్‌ను స్థాపించడం ద్వారా వేలాది మందికి ఆర్థికంగా నిస్సహాయులకు సహాయం చేశారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఈ శ్రీ రామ్ ఫైనాన్స్ గ్రూప్ నేడు 1 లక్షా 8 వేల మంది ఉద్యోగులకు జీవనోపాధిని కల్పించింది. ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న వారికి రుణాలు ఇవ్వడం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఎంతో సహాయం చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా సమాజంలోని అణగారిన వర్గానికి ఏదైనా చేయాలనుకున్న త్యాగరాజన్ తన రూ. 6210 కోట్ల విలువైన ఆస్తులను పేరుకు విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని ధనిక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుండి గణితశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. తరువాత, అతను 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరారు. తరువాతి 20 సంవత్సరాలు వివిధ ఆర్థిక సంస్థలలో పనిచేశాడు.
ఆయన 37 సంవత్సరాల వయస్సులో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు శ్రీరామ్ గ్రూప్ క్రింద 30 కంపెనీలకు అధిపతిగా ఉన్నాడు. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన సాధారణ కారులో ప్రయాణిస్తూ, ఒక చిన్న ఇంట్లో ఉంటారు. ఈ రోజుకు ఆయన వద్ద మొబైల్ ఫోన్ లేదని, మొబైల్ ఫోన్ వల్ల టార్గెట్ మిస్ అవుతుందని కూడా నమ్ముతున్నాడు. ప్రస్తుతం శ్రీరాం గ్రూపు కంపెనీలకు 23 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు.
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. జూన్ త్రైమాసికంలో దాని లాభం దాదాపు 200 మిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులకు మంచి వేతనం చెల్లించే ఆయన తాజాగా తన వాటాలన్నింటినీ (షేర్ హోల్డింగ్స్) ఉద్యోగుల సంఘానికి ఇవ్వడం ద్వారా సంచనంగా మారారు. శాస్త్రీయ సంగీత ప్రియుడైన త్యాగరాజన్, శ్రీరామ్ ఓనర్‌షిప్ ట్రస్ట్‌కు ఈ మొత్తాన్ని బదిలీ చేశాడు.
కొందరికి, ధనవంతులు కొంచెం ధనవంతులైతే, మరింత ధనవంతులు కావాలనే వ్యామోహం కలిగి ఉంటారు. సమాజం గురించి ఆలోచించకుండా డబ్బు వెనుక పడిపోతారు. కానీ త్యాగరాజన్ సంపన్నుడిగా జన్మించినప్పటికీ, సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.