'బంగారం ఉంటే భయం ఎందుకు'; ఇక్కడ అతి తక్కువకే గోల్డ్ లోన్..
ఊహించని విధంగా డబ్బు అవసరమైనప్పుడు ఏంచేస్తాం ఎవరినైనా అడిగి డబ్బు అప్పుగా తీసుకుంటాం.. అయితే ఇలాంటప్పుడు వడ్డీ అధికంగా వసూల్ చేస్తుంటారు. అయితే గోల్డ్ లోన్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. కొందరు గోల్డ్ లోన్ సురక్షితమైన లోన్ గా పరిగణిస్తారు కూడా.
గోల్డ్ లోన్ ద్వారా మీకు డబ్బు చేతికి అందుతుంది ఇంకా మీ బంగారం సురక్షితంగా ఉంటుంది. సెక్యూరిటీ కారణంగా బ్యాంకులు ఇతర లోన్ల కంటే గోల్డ్ లోన్ల పై తక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. అయితే లోన్ మొత్తం నిర్ణయించడానికి బంగారం విలువను చెక్ చేస్తారు. ఆ తర్వాత లోన్ మొత్తం అందించబడుతుంది.
చాలా బ్యాంకులు ప్రతినెలా వడ్డీ లేదా టర్మ్ ముగింపులో అసలు తిరిగి చెల్లించడం వంటి సాధారణ పేమెంట్ అప్షన్స్ అందిస్తాయి. గోల్డ్ లోన్‌లు 6 నుండి 12 నెలల కాల వ్యవధిలో ఉంటాయి. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు బ్యాంకు ఇంకా ఇతర అంశాలను బట్టి మారుతూ ఉంటాయి. అతి తక్కువ వడ్డీ రేట్లను అందించే టాప్ టెన్ బ్యాంకుల లిస్ట్ ఇక్కడ...
*కోటక్ మహీంద్రా బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.00% నుండి 24.00%, ప్రాసెసింగ్ ఫీజు 2% + GST
*HDFC బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.50% నుండి 17.30%, ప్రాసెసింగ్ ఫీజు 1%
*సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.45% నుండి 8.55%, ప్రాసెసింగ్ ఫీజు 0.50%
*UCO బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.50%, ప్రాసెసింగ్ ఫీజు 250 నుండి 5000
*ఇండియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.65% నుండి 9.00%, ప్రాసెసింగ్ ఫీజు 0.56%
*యూనియన్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.65% నుండి 9.90%
*SBI గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.70%, ప్రాసెసింగ్ ఫీజు 0.50% + GST
*బంధన్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.75% నుండి 19.25%, ప్రాసెసింగ్ ఫీజు 1% + GST
*పంజాబ్ & సింధ్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.85%, ప్రాసెసింగ్ ఫీజు 500 నుండి 10000
*ఫెడరల్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.99%