MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • UPI Payments: డిజిటల్‌ చెల్లింపులపై ఛార్జీలు.. ఆ ప్రైవేట్ బ్యాంక్ షాకింగ్ నిర్ణయం !

UPI Payments: డిజిటల్‌ చెల్లింపులపై ఛార్జీలు.. ఆ ప్రైవేట్ బ్యాంక్ షాకింగ్ నిర్ణయం !

UPI Payments: యూపీఐ వినియోగదారులకు ఐసీఐసీఐ షాక్ ఇచ్చింది. ఆగస్టు 1, 2025 నుండి ICICI బ్యాంక్ ప్రతి UPI లావాదేవీపై చెల్లింపు అగ్రిగేటర్లకు (PAలు) 0.02% ఛార్జ్ వసూలు చేయనుంది. ఇప్పటికే యాక్సిస్, యస్ బ్యాంకులు ఇదే విధంగా ఛార్జ్ చేస్తున్నాయి.

2 Min read
Author : Rajesh K
Published : Jul 31 2025, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐసీఐసీఐ బ్యాంక్ షాకింగ్ నిర్ణయం
Image Credit : social media

ఐసీఐసీఐ బ్యాంక్ షాకింగ్ నిర్ణయం

UPI Transaction Charges: మీరు UPI చెల్లింపులు చేస్తుంటే.. ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ICICI బ్యాంక్ UPI వినియోగదారులకు షాక్ ఇచ్చింది. డిజిటల్ లావాదేవీలపై కొత్త నియమాన్ని అమలు చేయబోతోంది. ఈ నిబంధన 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం చెల్లింపు అగ్రిగేటర్ల (PAలు) ద్వారా జరిగే UPI లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనుంది. ఛార్జీలు ఎలా ఉంటాయి? వీటి వల్ల ఎవరు ప్రభావితం అవుతారు? అనే వివరాలు మీ కోసం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 ఆ బ్యాంకుల బాటలో ఐసీఐసీఐ
Image Credit : our own

ఆ బ్యాంకుల బాటలో ఐసీఐసీఐ

యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ బాటలో ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా అదే దారిలో నడుస్తుంది. ఈ రెండు బ్యాంకులు ఇప్పటికే చెల్లింపు అగ్రిగేటర్ల (Payment Aggregators - PAలు) ద్వారా జరిగే UPI లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేస్తుంది. ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది. ఆగస్టు 1, 2025 నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనున్నది. ఈ నిర్ణయం డిజిటల్ చెల్లింపులపై ప్రభావం చూపనుంది. వినియోగదారులకు నేరుగా ఛార్జీలు లేకపోయినా, వ్యాపారులు భరించాల్సిన ఈ అదనపు ఛార్జీలు చివరికి కస్టమర్లకే పరోక్షంగా భారంగా మారే అవకాశం ఉంది.

35
ఎంత ఛార్జ్ వసూలు చేస్తుంది?
Image Credit : our own

ఎంత ఛార్జ్ వసూలు చేస్తుంది?

జూలై నెల ఆరంభంలోనే పేమెంట్‌ అగ్రిగేటర్లకు ఐసీఐసీఐ బ్యాంక్‌ సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. ఐసీఐసీఐలో ఎస్క్రో ఖాతాను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్‌ (Payment Aggregators)పై ప్రతి లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు (0.02%) ఛార్జ్ వసూలు చేయనుంది. ఉదాహరణకు, రూ. 10,000 లావాదేవీపై రూ. 2 ఛార్జ్ పడుతుంది. అయితే ఒక్క లావాదేవీపై గరిష్టంగా రూ. 6 వరకు మాత్రమే ఛార్జ్ విధించబడుతుంది. ఇక, ఎస్క్రో ఖాతా లేనివారైతే.. ఈ ఛార్జీలు రెట్టింపు కానున్నాయి. అంటే.. ఎస్క్రో ఖాతా లేని PAలపై 4 బేసిస్ పాయింట్లు (0.04%), అంటే రూ. 10,000కి రూ. 4, గరిష్టంగా రూ. 10 వరకు ఛార్జ్ విధించబడుతుంది.

45
పేమెంట్ అగ్రిగేటర్లు అంటే ఏమిటి?
Image Credit : our own

పేమెంట్ అగ్రిగేటర్లు అంటే ఏమిటి?

పేమెంట్ అగ్రిగేటర్లు అనేవి ఆన్‌లైన్ వ్యాపారులకు కస్టమర్ల నుండి డిజిటల్ చెల్లింపులను స్వీకరించడంలో సహాయపడే సంస్థలు. ఉదాహరణకు, మీరు దుకాణం లేదా ఈ-కామర్స్ సైట్‌లో UPI ద్వారా చెల్లింపు చేస్తే, ఆ చెల్లింపును PhonePe, Paytm, Razorpay వంటి చెల్లింపు అగ్రిగేటర్ ప్రాసెస్ చేస్తుంది. ఆ తరువాత ఆ మొత్తాన్ని వ్యాపారి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తుంది.

55
ఛార్జ్ ఎందుకు విధించబడుతోంది?
Image Credit : Getty

ఛార్జ్ ఎందుకు విధించబడుతోంది?

ప్రభుత్వం ఏ వ్యాపారవేత్త నుండి (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేయదు. ఇది ప్రస్తుతం సున్నా. కానీ NPCI బ్యాంకుల నుండి స్విచ్ ఫీజులను వసూలు చేస్తుంది. కొన్ని బ్యాంకులు చెల్లింపు అగ్రిగేటర్ల నుండి ఈ రుసుమును వసూలు చేస్తున్నాయి. ముఖ్యమైన చెల్లింపులపై ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. ఇటీవల, UPI చెల్లింపులు చేస్తున్నప్పుడు వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. UPI సర్వర్ ప్రతిరోజూ డౌన్ అయ్యేది. NPCI ఈ సమస్యకు ఈ పరిష్కారాన్ని కనుగొంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Recommended image2
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image3
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Related Stories
Recommended image1
UPI: యూపీఐ కొత్త రూల్స్.. ఆ విషయంలో లిమిట్​ దాటితే అంతే..
Recommended image2
UPI Payments: యూపీఐ పేమెంట్స్ లో భార‌త్ టాప్.. ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved