MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • UPI: యూపీఐ కొత్త రూల్స్.. ఆ విషయంలో లిమిట్​ దాటితే అంతే..

UPI: యూపీఐ కొత్త రూల్స్.. ఆ విషయంలో లిమిట్​ దాటితే అంతే..

New UPI Rules : యూపీఐ (UPI) కొత్త రూల్స్ ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. లావాదేవీలు మరింత సురక్షితంగా, సులభంగా సాగేందుకు ఈ మార్పులు కీలకం కానున్నాయి. అయితే.. ఆ మార్పుల వల్ల యూజర్ల కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇంతకీ ఆ మార్పులేంటీ?

2 Min read
Author : Rajesh K
Published : Jul 29 2025, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అరచేతిలో బ్యాంక్
Image Credit : our own

అరచేతిలో బ్యాంక్

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉండి, బ్యాంక్ అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో UPI భాగంగా మారింది. కూరగాయలు కొనడం నుంచి పెద్ద మొత్తాల లావాదేవీల వరకు అన్నింటికీ UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.  అది కూడా  అన్నీ ఒక్క క్లిక్‌లో పూర్తి చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
యూపీఐ కొత్త మార్గదర్శకాలు వచ్చేశాయ్
Image Credit : Asianet News

యూపీఐ కొత్త మార్గదర్శకాలు వచ్చేశాయ్

తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఈ మార్పులు కేవలం లావాదేవీలను సులభతరం చేయడమే కాదు, Google Pay, PhonePe వంటి ప్రముఖ యాప్‌లపై సర్వర్ భారాన్ని తగ్గిస్తాయి. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ మార్పులు తీసుకవచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

37
బ్యాలెన్స్ చెక్‌కి లిమిట్!
Image Credit : Google

బ్యాలెన్స్ చెక్‌కి లిమిట్!

ప్రస్తుతం UPI యాప్‌ల ద్వారా ఎన్ని సార్లైనా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చెక్ చేయొచ్చు. కానీ ఆగస్టు 1, 2025 నుంచి ప్రతి యాప్‌ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే చెక్ చేయడానికి అనుమతించబడుతుంది. ఇది అనవసరమైన అభ్యర్థనలు తగ్గించి, యాప్‌లపై సర్వర్ ఒత్తిడిని తగ్గించడానికే తీసుకున్న నిర్ణయం.

47
బ్యాంక్ అకౌంట్ లిస్ట్ చూసే పరిమితి
Image Credit : Asianet News

బ్యాంక్ అకౌంట్ లిస్ట్ చూసే పరిమితి

మీ మొబైల్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను UPI యాప్‌లో చూసే అవకాశం ఇక పరిమితమే. ఆగస్టు 1, 2025 నుంచి, ప్రతి యాప్‌లో రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే లింక్‌డ్ అకౌంట్‌లను చెక్ చేయవచ్చు. ఈ మార్పు అనవసర API కాల్స్‌ను తగ్గించి, యాప్‌ల పనితీరును వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు తీసుకొచ్చారు.

57
ఆటోపేమెంట్ కు టైమింగ్ లిమిట్స్
Image Credit : Asianet News

ఆటోపేమెంట్ కు టైమింగ్ లిమిట్స్

కరెంట్ బిల్లులు, సబ్‌స్క్రిప్షన్స్, EMI లాంటి పేమెంట్లకు ప్రస్తుతం UPI యాప్‌లలో ఆటో డెబిట్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇకపై ఈ ఆటోమేటెడ్ చెల్లింపులకు టైమ్ లిమిట్స్ నిర్ణయించారు. ఆగస్టు 1, 2025 నుంచి ఆటో డెబిట్‌ల ప్రాసెసింగ్  ఉదయం 10 గంటల వరకు, మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు,  ఆ తరువాత రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఆటో డెబిట్‌లు జరుగుతాయి. ఇది పీక్ టైమ్స్‌లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు,  సిస్టమ్ పనితీరును మెరుగుపరచేందుకు తీసుకున్న కీలక చర్య.

67
పెండింగ్ పేమెంట్ పై పరిమితి!
Image Credit : Asianet News

పెండింగ్ పేమెంట్ పై పరిమితి!

కొన్నిసార్లు UPI ద్వారా పేమెంట్ చేసినప్పుడు డబ్బులు కట్‌ అయి, అవతలి వ్యక్తికి అందకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో యూజర్లు "Pending Transaction Status" చెక్ చేస్తుంటారు. ఇకపై వాటిని చెక్ చేయడానికి కూడా కొత్త లిమిట్ వస్తోంది. ఆగస్టు 1, 2025 నుంచి.. మీరు పెండింగ్ పేమెంట్ స్టేటస్‌ను రోజుకు గరిష్టంగా 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు. అలాగే..  ప్రతి చెక్‌ మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ తప్పనిసరి.  

77
ఎందుకు ఈ మార్పులు?
Image Credit : Asianet News

ఎందుకు ఈ మార్పులు?

భారతదేశంలో UPI లావాదేవీలు నెలకు 16 బిలియన్లకు చేరుకుని, అపారమైన వృద్ధిని సాధించాయి. ఈ భారీ వినియోగం సర్వర్లపై చాలా భారాన్ని కలిగిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో చాలా UPI యాప్‌లు పనిచేయడం ఆగిపోయాయి. సర్వర్ భారాన్ని తగ్గించడం ద్వారా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడమే NPCI లక్ష్యం.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్ నుంచి రూ.5876 కోట్ల వస్తువులు కొన్న పాకిస్తాన్.. ఏమేం కొన్నారంటే
Recommended image2
Phonepe: 11 రూపాయ‌ల‌తో రూ. 25 వేల హెల్త్ పాల‌సీ.. ఫోన్‌పేలో అదిరిపోయే ఆఫర్
Recommended image3
Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !
Related Stories
Recommended image1
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.? మినిమం బ్యాలెన్స్ లేక‌పోతే అంతే సంగ‌తులు
Recommended image2
UPI Payments: యూపీఐ పేమెంట్స్ లో భార‌త్ టాప్.. ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved