- Home
- Business
- అకౌంట్ ఉండాలంటే మినిమం బ్యాలెన్స్ రూ. 50 వేలు ఉండాల్సిందే.. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే.?
అకౌంట్ ఉండాలంటే మినిమం బ్యాలెన్స్ రూ. 50 వేలు ఉండాల్సిందే.. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే.?
Minimum balance: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ ఇటీవల తమ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ తెలిపిన విషయం తెలిసిందే. అకౌంట్‌లో కచ్చితంగా రూ. 50 వేలు బ్యాలెన్స్ ఉండాలనే నిబంధన, అందరినీ షాక్‌కి గురి చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన నిర్ణయం
దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ (ICICI) సేవింగ్స్ ఖాతాల కనీస నెలసరి సగటు నిల్వను (Monthly Average Balance) భారీగా పెంచింది. 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధన ప్రకారం, మెట్రో, పట్టణ శాఖల్లో ఖాతాదారులు మినిమం బ్యాలెన్స్ రూ. 50,000 నిల్వ ఉంచాలి. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ. 10,000 మాత్రమే ఉండేది. ఒకేసారి ఏకంగా ఐదు రెట్లు పెంచారన్నమాట.
KNOW
పెద్ద ఎత్తున వ్యతిరేకత
ఐసీఐసీఐ తీసుకున్న నిర్ణయంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. రూ. 50 వేలు మినిమం బ్యాలెన్స్ ఉండడం అనేది ఎంత వరకు సమంజసం అంటూ ఖాతాదారులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో తాజాగా దీనిపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు.
బ్యాంకులదే నిర్ణయం
బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ (Minimum Balance) ఎంత ఉండాలన్నది పూర్తిగా బ్యాంకులే నిర్ణయించుకుంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ విషయంలో RBI ఎలాంటి పరిమితులు విధించదని ఆయన గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు. "కొన్ని బ్యాంకులు రూ. 2,000, మరికొన్ని రూ. 10,000గా నిర్ణయిస్తాయి. కొందరు కనీస నిల్వ నిబంధననే పూర్తిగా తొలగిస్తారు. ఇది బ్యాంకుల వ్యాపార నిర్ణయం" అని మల్హోత్రా వివరించారు.
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు
* సెమీ అర్బన్ ప్రాంతాలు: కనీస నిల్వ రూ. 5,000 నుంచి రూ. 25,000కు పెరిగింది.
* గ్రామీణ ప్రాంతాలు: రూ. 2,500 నుంచి రూ. 10,000కు సవరించారు.
ఈ పరిమితి కంటే తక్కువ మొత్తం ఉంటే. ఖాతాదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఫైన్ ఎలా లెక్కిస్తారంటే.?
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకారం, కనీస నిల్వ కంటే తక్కువగా ఉంటే, లోటు మొత్తంపై 6% లేదా రూ. 500 ఈ రెండింటిలో ఏది తక్కువైతే, దానిని ఛార్జీగా విధిస్తారు. ఈ మార్పు కొత్తగా ఖాతా తెరిచే వారికి మాత్రమే వర్తించనుందని బ్యాంక్ స్పష్టం చేసింది.