Business Ideas: మహిళలు తెలంగాణ ప్రభుత్వం అందించే ఈ కోర్సును రూ.3500 చెల్లించి నేర్చుకుంటే నెలకు 1 లక్ష పక్కా
మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి వెంటనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముద్ర రుణాల ద్వారా మీరు వ్యాపారం చేసినట్లయితే ప్రతి నెల చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు డిజైనర్ బట్టలు వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు ఇతర శుభకార్యాలకు షాప్ లో లభించే రెడీమేడ్ దుస్తుల కన్నా కూడా తమ శరీరానికి తగ్గట్టుగా తమ అందానికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్న బట్టలను వేసుకోవడానికి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారి కోసమే బోటిక్ పేరిట వస్త్ర దుకాణాలను స్థాపిస్తున్నారు. ఈ బోటిక్ వ్యాపారం ఈ మధ్యకాలంలో చిన్న పట్టణాల్లో ఒక సైతం పొందుతుంది మీరు కూడా స్వయం ఉపాధి కోసం ఆలోచిస్తున్నట్లయితే బోటిక్ వ్యాపారం ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు తద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
బోటిక్ నడపాలంటే మీరు ఫ్యాషన్ డిజైనర్ అయి ఉండాలి. ఫ్యాషన్ డిజైనింగ్ కోసం మీరు కోర్సు చేసి ఉండాలి ఈ కోర్సులో మీరు దుస్తులను ఎలా డిజైన్ చేయాలి శరీర ఆకృతికి తగ్గట్లు డిజైన్లను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రంగు ఎలా సెలెక్ట్ చేయాలి. వంటి అనేక వివరాలు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో మీకు నేర్పిస్తారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చాలా ఖరీదైనది అనే పేరు ఉంది. లక్షల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ పేద మధ్య తరగతి ప్రజలు సైతం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను అతి తక్కువ ధరకే నేర్చుకునే అవకాశం ఉంది అది ఎక్కడో ఎలాగో తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సెట్విన్ సంస్థ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అతి తక్కువ ధరకే నేర్పిస్తోంది. ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు సొంతంగా బోటిక్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఏదైనా పేరు ఉన్న బోటిక్ లో మీరు పని చేయవచ్చు. . సెట్విన్ సంస్థలో మీరు కోర్సు పూర్తి చేసుకున్న అనంతరం సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్న అనంతరం లభించిన సర్టిఫికెట్ ఆధారంగా మీరు బోటిక్ ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మీ వద్దకు వచ్చిన కస్టమర్లకు కావాల్సిన డిజైనింగ్ డ్రెస్సులను తయారు చేసి ఇవ్వచ్చు తద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ధర విషయానికి వచ్చినట్లయితే 3000 రూపాయల నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ధర 3,500 మాత్రమే. కోర్సు వ్యవధి మూడు నెలలు. కోర్సు అనంతరం మీకు సర్టిఫికెట్ ప్రధానం చేస్తారు.
ఇక బోటిక్ విషయానికి వచ్చినట్లయితే, మీరు అతి తక్కువ పెట్టుబడి తో కూడా ఈ బోటిక్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు బోటిక్ ఏర్పాటు చేసి పదిమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బోటిక్ విశేషాలను ప్రచారం చేసుకోవచ్చు తద్వారా మీకు కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది.
గమనిక: పైన పేర్కొన్నటువంటి బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వ్యాపారంలోకి ప్రవేశించేముందు పూర్తి వివరాలను అనుభవజ్ఞుల వద్ద నుంచి తెలుసుకోవడం ముఖ్యం. మీరు చేసే వ్యాపారానికి ఏషియన్ న్యూస్ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు.