- Home
- Business
- కోటీశ్వరులు అవడం ఎలా : కేవలం నెలకు రూ. 1000 పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో పెద్ద మొత్తంలో సంపాదించే చాన్స్
కోటీశ్వరులు అవడం ఎలా : కేవలం నెలకు రూ. 1000 పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో పెద్ద మొత్తంలో సంపాదించే చాన్స్
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బు సంపాదించడం రిస్క్ లేని పెట్టబడి సాధనం అని చెప్పాలి. పెట్టుబడి పెట్టడం అనేది ఆర్థిక క్రమశిక్షణకు మొదటి మెట్టు అని నిపుణులు చెబుతుంటారు నిజానికి ప్రతి నెల కొద్ది మొత్తం సిప్ (నెల వారీ) పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే అవకాశం ఉంటుంది తద్వారా పెద్ద మొత్తంలో మీరు డబ్బు పొందుతాడు

Money tips
గడచిన మూడేళ్లుగా కరోనా వల్ల మార్కెట్లో అస్థిరంగా మారిపోయాయి దీంతో ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ నష్టాలకు గురయ్యాయి మదుపరులకు నష్టాలను మిగిల్చాయి అయితే కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ మాత్రం మదుపర్లకు మంచి లాభాలను అందిస్తున్నాయి అలాంటి ఫండ్స్ గురించి తెలుసుకుందాం . ప్రస్తుతం మనం మాట్లాడుకునే ఈ ఫండ్ కేవలం ఒక లక్ష పెట్టుబడిని గడచిన మూడేళ్ల కాలంలో 2.3 లక్షలుగా మార్చింది
గత మూడు సంవత్సరాలలో, స్మాల్-క్యాప్స్ మదుపరులకు భారీ నష్టాలను మిగిల్చాయి. మదుపుదారుల సంపదను నాశనం చేశాయి, అయితే, ఇదే కాలంలో కెనరా రోబెకో స్మాల్-క్యాప్ ఫండ్ దాని పెట్టుబడిదారుల సంపదను రెట్టింపు చేసింది.
కెనరా రోబెకో స్మాల్-క్యాప్ ఫండ్, ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు, ఇది కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్ నుండి స్మాల్ క్యాప్ ఆఫర్. కెనరా రోబెకో అత్యంత తక్కువ అంచనా వేయబడిన అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో (AMCలు) ఒకటి. అయితే, ప్రారంభం నుండి, ఈ ఫండ్ డిసెంబర్ 2022 నాటికి రూ.4,568 కోట్ల విలువైన ఆస్తులను సేకరించింది.
అంతేకాకుండా, ప్రారంభం నుండి, ఈ ఫండ్ 26.75 శాతం వార్షిక రాబడిని అందించింది. గత మూడు సంవత్సరాలలో, ఈ ఫండ్ 33 శాతం రాబడిని ఇచ్చింది. అంటే ఒక రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు రాబడినే అందించింది బ్యాంకుల్లో పెట్టినా కూడా ఇంత మొత్తంలో మనం డబ్బు సంపాదించలేము.
ఇక ఈ ఫండ్లో మీరు నెల ప్రతినెల సిప్ (నెల వారీ) పద్ధతిలో డబ్బు పెట్టే డబ్బు మదుపు చేసుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మూడేళ్ల పాటు మీరు నెలకు 3000 చొప్పున ఈ ఫండ్లో మీరు డబ్బు మదుపు చేసి ఉంటే ప్రస్తుతం మీరు రూ. 1,08,000 పెట్టుబడిపై మీరు రూ.1,68,638 (+56.15%) రాబడి పొంది ఉండేవారు అంటే దాదాపు 60 వేల వరకు లాభం వచ్చి ఉండేది.
ఒకవేళ మీరు ఇదే ఫండ్లో నెలకు పదివేల వరకు మోదుపు చేసి ఉండి ఉంటే మూడేళ్లలో మీరు రూ. 3,60,000 పెట్టిన మొత్తంపై రూ.5,62,127 (+56.15%) వరకూ సంపాదించుకునే అవకాశం ఉంది అంటే సుమారు మీకు రెండు లక్షల వరకు అదనంగా డబ్బు సంపాదించి ఉండేవారు. అందుకే నిపుణులు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా చక్కటి లాభాలు పొందవచ్చని సలహా ఇస్తూ ఉంటారు.
(నోట్: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్నటువంటి సమాచారం పాఠకుల సమాచారం కోసం మాత్రమే, పెట్టుబడి సలహా కాదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యత వహించాలి ఫైనాన్షియల్ మార్కెట్లో పెట్టుబడును పెట్టేముందు నిపుణుల సలహా తీసుకోవాలి)