Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Cheapest EV Cars: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లు అధికంగానే అమ్ముడవుతున్నాయి. వీటి ధర తక్కువగా ఉండడం, మెయింటెనెన్స్ సులువుగా ఉండటంతో ఎక్కువ మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చవకగా వచ్చే ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇక్కడ ఇచ్చాము.

టాటా పంచ్ ఈవీ
టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో (25kWh, 35kWh) లభిస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేశారంటే 365 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు దీని సొంతం. ఇది మనదేశంలోని అత్యంత సురక్షితమైన ఈవీ కార్లలో ఒకటిగా మంచి పేరు పొందింది. ఇక దీని ధర రూ.9.99 లక్షలతో ప్రారంభమవుతుంది.
టాటా టియాగో ఈవీ
టాటా టియాగో ఈవీలో 19.2 kWh, 24 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 293 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఇండియాలో టాటా టియాగో ఈవీ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ మంది ఈ కారునే కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇదే తక్కువ ధరకు లభిస్తోంది.
ఎంజీ కామెట్
ఎంజీ కామెట్ ఈవీ కారు చూసేందుకు చిన్నగా ఉంటుంది. 17.3 kWh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి మొదలవుతుంది. అంటే ఆన్ రోడ్ ధర ఆరు లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ కారు 56.3 bhp పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సిట్రోయెన్ eC3
సిట్రోయెన్ ఈసీ3 కొంచెం ఖరీదైన కారే. ఎక్స్-షోరూమ్ ధర రూ.12.90 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది 29.2 kWh బ్యాటరీతో 246 కి.మీ పరిధిలో పనిచేస్తుంది. కేవలం 6.8 సెకన్లలో 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 107 కి.మీ. దీని లుక్ కూడా ఎంత మందిని ఆకట్టుకునేలా ఉంటుంది.
టాటా నెక్సాన్ ఈవీ
మన దేశంలో ఎక్కువ మంది మెచ్చిన కారు టాటా నెక్సాన్ ఈవీ. ఇది 30 kWh, 45 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 489 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. అంటే మీరు విజయవాడలో మొదలుపెడితే హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. ఈ మోడల్ 214.5 bhp పవర్, 215 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర 13 లక్షల రూపాయలు దాటిపోవడం ఖాయం. కాబట్టి ఇది కాస్త ఖరీదైనదే.

