MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?

Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?

Zodiac Compatibility: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులను బట్టి వివాహం చేసుకోవాలి. కొన్ని రాశుల పురుషులకు, కొన్ని రాశుల మహిళలతో సఖ్యత బాగా కుదురుతుంది.  ఏ రాశి మహిళలకు ఏ రాశి పురుషులు కరెక్ట్‌గా సెట్ అవుతారో చూడండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 10 2026, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి వృషభ రాశి
Image Credit : stockPhoto

మేష రాశి - వృషభ రాశి

మేష రాశి మహిళలకు వృషభ రాశి పురుషులకు బాగా సఖ్యత కుదురుతుంది. మేష రాశిలో పుట్టిన అమ్మాయిలు చాలా నిగ్రహంగా ఉంటారు. వీళ్లు ఎమోషనల్ గా ఎవరితోనూ ఆడుకోరు. చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు. వీళ్లు చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. వీరికి లైంగికంగా సింహ, తుల, ధనుస్సు, కుంభ, మిథున, మేష, వృశ్చిక రాశుల వారు సెట్ అవుతారు. వృషభ రాశి మహిళలు సుఖాన్ని కోరుకుంటారు.  తమ శక్తిని వృథా చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎదుటి వ్యక్తి భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు.  వీరికి ప్రేమ విషయంలో మీన, కర్కాటక, కన్య, మకర, వృశ్చిక రాశుల వారు సరిపోతారు.

26
మిథున - కర్కాటక రాశి
Image Credit : chatgpt

మిథున - కర్కాటక రాశి

మిథున రాశి మహిళలు తమ భాగస్వాములతో చాలా ప్రేమగా ఉంటారు. వీరు మాటలతో రెచ్చగొట్టడానికి ఏమాత్రం ఇష్టపడరు. లైంగిక క్రియ సమయంలో వీరికి శారీరక ప్రేరణతో పాటు మానసిక ప్రేరణ కూడా చాలా ముఖ్యం. వీరికి లైంగికంగా కుంభ, తుల, మేష, సింహ, ధనుస్సు, వృశ్చిక రాశుల వారు  బాగా సెట్ అవుతారు. కర్కాటక రాశి మహిళలకు ప్రేమ, నమ్మకం, ఆప్యాయత చాలా అవసరం. కర్కాటక రాశి మహిళలకు భద్రత భావాన్ని కలిగించే పురుషులు అంటే చాలా ఇష్టం. ఎదుటి వ్యక్తికి ఏం కావాలో ఆమె గ్రహించగలదు. వీరికి లైంగికంగా కుంభ, మకర, కన్య, మీన, వృషభ, ధనుస్సు, వృశ్చిక రాశుల వారు సరిపోతారు.

Related Articles

Related image1
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
36
సింహ - కన్యా రాశి
Image Credit : Asianet News

సింహ - కన్యా రాశి

సింహ రాశికి చెందిన మహిళలు వారిని వారు పెద్ద స్టార్ లా ఫీలవుతారు.  వీరికి లైంగికంగా తుల, మిథున, ధనుస్సు, మేష, కుంభ రాశుల వారు సెట్ అవుతారు. కన్య రాశి మహిళలు వినయంగా, పవిత్రంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వీళ్లు ఎన్‌సైక్లోపీడియాలు, గూగుల్ నుంచి అన్నీ విషయాలు తెలుసుకుంటారు.  పూర్తి శ్రద్ధను తమపైనే పెట్టే భాగస్వామి వీరికి కావాలి. వీరికి లైంగికంగా, ప్రేమ విషయంలో వృషభ, మకర, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారు సరిపోతారు.

46
తులా - వృశ్చిక రాశి
Image Credit : social media

తులా - వృశ్చిక రాశి

తుల రాశి మహిళలకు మంచి భోజనం, మంచి దుస్తులు, పువ్వులు లేదా సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. వీరు తమ భాగస్వామిగా ఎవరు సరైన వ్యక్తో తెలుసుకునే వరకు ఎవరికి చేరువ కారు.  తమ భాగస్వామిని సంతోషపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.  వీరికి మేష, మిథున, ధనుస్సు, కుంభ, సింహ, వృశ్చిక రాశుల వారు లైంగికంగా, ప్రేమ విషయంలో సెట్ అవుతారు. ఇక వృశ్చిక రాశి మహిళలు విలాసవంతమైన పురుషులను ఇష్టపడతారు. వీరికి మీన, మకర, వృషభ, మేష, సింహ, ధనుస్సు రాశుల వారు లైంగికంగా సరిపోతారు.

56
ధనూ - మకర రాశి
Image Credit : freepik

ధనూ - మకర రాశి

ధనుస్సు రాశి మహిళలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చాలా ఓపెన్ నేచర్ కలిగి ఉంటారు. ఇదే గుణం వారిని చాలా ప్రేమగల, ఆసక్తికరమైన ప్రేమికులుగా చేస్తుంది. వీరికి ప్రేమ విషయంలో తుల, సింహ, మిథున, మేష, ధనుస్సు, కుంభ, కర్కాటక, మకర రాశుల వారు సెట్ అవుతారు. మకర రాశి మహిళలు పైకి గౌరవనీయులుగా,  కాస్త బోరింగ్‌గా కనిపించవచ్చు. కానీ వీళ్లు లోలోపల మాత్రం చాలా రొమాంటిక్‌గా ఉంటారు. వీరికి ప్రేమ విషయంలో మీన, వృశ్చిక, కన్య, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు రాశుల వారు సరిపోతారు.

66
కుంభ - మీన రాశి
Image Credit : Asianet News

కుంభ - మీన రాశి

కుంభ రాశి మహిళలు చాలా  తెలివైన భాగస్వామిని కోరుకుంటారు. అలాంటి వ్యక్తే ఆమెకు సరైన మగాడు అని భావిస్తారు.  తమను నవ్వించే, తమతో కలిసి నవ్వే వారి కోసం వెతుకుతారు. వీరికి లైంగికంగా, ప్రేమ పరంగా మిథున, తుల, సింహ, ధనుస్సు, మేష, కుంభ రాశుల వారు సెట్ అవుతారు. ఇక మీన రాశి మహిళలు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ మహిళలు తమ భాగస్వామికి ఏం కావాలో మాటల్లో చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. వీరికి  వృశ్చిక, కర్కాటక, మకర, వృషభ, కన్య రాశుల వారు సరిపోతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Recommended image3
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Related Stories
Recommended image1
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved