4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే, పూర్తి వివరాలు
పర్సనల్ లోన్ పొందాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది. సిబిల్ చూడాలి, పేస్లిప్ లు ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అందించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అదో పెద్ద ప్రాసెస్. అయితే కేవలం 3 నుంచి 4 గంటల్లో లోన్ పొందే అవకాశం ఉందని మీకు తెలుసా.? అది కూడా తక్కువ వడ్డీకే. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ సేవలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మోదీ ప్రభుత్వ తక్షణ వ్యక్తిగత రుణం
అప్పటికప్పుడు డబ్బు కావాలనుకునే వారు ఎక్కువ వడ్డీతో ప్రైవేట్ యాప్ లను ఆశ్రయిస్తుంటారు .అయితే ఇవి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రభుత్వ రంగ వ్యాంకులు సైతం త్వరగా రుణాలు అందిస్తాయని మీకు తెలుసా.? మీ అవసరానికి అనుగుణంగా కేవలం 3 నుంచి 4 గంటల్లోనే వ్యక్తిగత రుణాల పొందొచ్చు.
త్వరిత రుణాలు
ఇలా రుణాలు పొందడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. మోదీ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ త్వరిత వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఈ డిజిటల్ యుగంలో, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా, తక్కువ సమయంలో ప్రభుత్వం నుంచి పర్సనల్ లోన్ పొందొచ్చు.
ప్రభుత్వ రుణాలు
ఈ రుణం పొందడానికి, ప్రభుత్వ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి మీ KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. KYCలో మీ డాక్యుమెంట్లను, మునుపటి రుణ వివరాలు ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
వ్యక్తిగత రుణాలు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత. 30 నిమిషాల నుండి 4 గంటల్లో డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది. మీ సౌలభ్యం ప్రకారం EMIని మీరే నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల మీ బడ్జెట్‌కు అనుగుణంగా రుణాన్ని సులభంగా తిరిగి చెల్లించవచ్చు.
ఆన్‌లైన్ రుణాలు
జాగ్రత్తలు..
ఆన్‌లైన్‌లో రుణం తీసుకునేటప్పుడు, నమ్మకమైన సంస్థలను ఎంచుకోవాలి. ఇటీవల ఆర్థికపరమైన మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేటును జాగ్రత్తగా చూసుకుని, మోసగాళ్ల బారిన పడకుండా చూసుకోవాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వెబ్‌సైట్‌లతో పంచుకోవద్దు.