MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్

Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్

Pension Scheme: పెన్షన్ స్కీమ్స్ అదనపు భారంగా మారుతున్నాయని, చాలా సెక్టార్లలో పెన్షన్ తీసేస్తున్నారని వస్తున్న రూమర్స్ కి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఒక హైబ్రిడ్ మోడల్‌ పెన్షన్ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 27 2025, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కేంద్ర ప్రభుత్వంలోని 23 లక్షల మంది ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. పెన్షన్ స్కీమ్స్ గురించి వస్తున్న అనేక రూమర్స్ కి ఈ వార్తతో చెక్ పడినట్లు అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. దీని పేరు  యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS). దీన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తీసుకురానున్నారు. దీనికి అర్హులు ఎవరు, బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

23 లక్షల మందికి ఉపయోగం

కొత్త పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ, 25 సంవత్సరాల కంటే తక్కువ పనిచేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల కనీసం రూ.10,000 పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే అతని కుటుంబ సభ్యులు చివరి పెన్షన్‌లో 60 శాతం పెన్షన్‌గా పొందుతారు. ఈ పథకం ద్వారా రిటైర్ అయిన తర్వాత దేశ వ్యాప్తంగా కనీసం 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

34

UPS ఎలా ప్రారంభించబడింది

ఇప్పటి వరకు ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) వల్ల ఎటువంటి స్థిరమైన ఆదాయం రాదు. మార్కెట్ ఆధారిత ఆదాయాన్ని మాత్రమే అందిస్తుంది. అయితే కొత్త పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS) వల్ల నికరంగా ఫిక్స్‌డ్ ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్ కొత్త వారికే కాకుండా ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా UPSకు మారవచ్చు.

ఇది కూడా చదవండి ఏటీఎంలో డబ్బులు తీస్తే ఇకపై ఛార్జీల మోతే.. మే 1 నుండి కొత్త రూల్స్

44

హైబ్రిడ్ ఫెన్షన్ పథకం ఇది..

పాత పెన్షన్ పథకం(OPS) 2004లో NPSగా మార్పు చెందింది. NPSలో ఉన్న లోటుపాట్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం UPSను ప్రారంభిస్తోంది. 

UPS అనేది పాత పెన్షన్ పథకం (OPS), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో ఉండే ముఖ్యమైన విషయాలను కలిపి హైబ్రిడ్ మోడల్ గా రూపొందించారు. 

వారం క్రితమే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ 1 నుంచి పోర్టల్‌లో UPSకు దరఖాస్తు చేసుకోవచ్చు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved