Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‍న్యూస్..మూడ్రోజులుగా కుప్పకూలిపోతున్న బంగారం
Today Gold Rate: ఫ్లాష్ ఫ్లాష్..మళ్లీ తగ్గిన బంగారం ధరలు. 3 రోజులుగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఈరోజు కూడా పసిడి పాతాళానికి పడిపోయింది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా అటు చమురు, గ్యాస్, బంగారం, వెండి రేట్లపై భారీ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి.

ఆకాశానికి తాకనున్న ముడిచమురు ధరలు
ఈ నెలాఖరులోకా పశ్చిమాసియాలో యుద్ధం ముగియకపోతే ముడిచమురు ధరలు ఆకాశానికి తాకే అవకాశం ఉంది. యుద్ధం మరో 6 నెలలు కనుక కొనసాగితే భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరగనుంది. అన్ని రంగాలు దెబ్బతింటాయి. ఊహించుకుంటేనే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. చమురు, గ్యాస్ నిత్యవసర వస్తువులు కావడంతో....ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా డాలర్ బలపడటం వల్ల ఖరీదైన లోహల రేట్లు కుప్పకూలిపోతున్నాయి.
నవ్వులపాలవుతున్న ట్రంప్
అటు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై దాడి చేస్తున్నాయి. ఇజ్రాయెల్ కు అమెరికా యుద్ధం విషయంలో హెల్ప్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ను అమెరికా పక్కన పెట్టి డైరెక్టుగా యుద్ధానికి దిగింది. డీల్ విషయంలో ఇరాన్ కు ట్రంప్ గడువు పొడిగిస్తూ, బెదిరిస్తూ ఏదో సాధించాలనే తపనతో ఉన్నారు. కానీ ట్రంప్ తీరు చూసి ప్రపంచదేశాలు నవ్వుకుంటున్నాయి.
ట్రో కెమికల్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడి
అయితే మార్చి 18న ఇరాన్ లోని అతిపెద్ద పెట్రో కెమికల్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడి చేయగా ట్రంప్ ఖండించారు. మరోసారి అలా జరగదని చెప్పినా కూడా ఇజ్రాయెల్ మాత్రం లెక్కచేయలేదు. ఇరాన్ లోని అతిపెద్ద పెట్రో కెమికల్ ప్లాంట్ పై మరోసారి దాడి దాడి చేసింది. దీనివల్ల పశ్చిమాసియాలో యుద్ధ మంటలు చల్లారడం లేదు.
24 క్యారెట్లపైరూ.820 తగ్గుదల
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం మరోసారి పడిపోయింది. 24 క్యారెట్లపై 10 గ్రాములకు రూ.820 తగ్గి.. రూ.1,49,840గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.750 తగ్గి.. రూ.1,37,350గా ఉంది. వెండి ధరలు చూసుకుంటే...రూ.5వేలు తగ్గి రూ.2.55లక్షల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.93.05గా ఉంది.

