MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold Price Today: పసిడి ప్రియులకు మండే గుడ్‍న్యూస్...భారీగా పతనమైన బంగారం

Gold Price Today: పసిడి ప్రియులకు మండే గుడ్‍న్యూస్...భారీగా పతనమైన బంగారం

Gold Price Today: పసిడి ప్రియులకు మండే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఒక్కసారిగా పతనమైపోయాయి. శుక్రవారం పెరిగిన ధరలు శనివారం, ఆదివారం అలానే కొనసాగాయి. మళ్లీ లాంగ్ వీకెండ్ తర్వాత ధరలు కుప్పకూలిపోయాయి. బంగారం ధరలు ఎంతుందంటే... 

1 Min read
Author : Nandini Arava
Published : Apr 06 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దగ్గరపడుతున్న అక్షయతృతీయ
Image Credit : Getty

దగ్గరపడుతున్న అక్షయతృతీయ

దగ్గరపడుతున్న అక్షయతృతీయ, పెళ్లిళ్లు, శుభకార్యాలు...వచ్చేవన్ని శుభఘడియలే. ఇప్పుడు బంగారం తగ్గడం అన్నది మామూలు విషయం కాదు. అక్షయతృతీయ రోజు బంగారం కొంటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాంటి ఆ రోజు సాధారణంగా బంగారం ధరలు పెరగడం కామనే. కానీ ఈ అక్షయ తృతీయకు మాత్రం పసిడి రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులతో జ్యూవెలరీ షాపులు కిటకిటలాడనున్నాయి. అక్షయతృతీయకు ముందు బంగారం ధరలు భారీ స్థాయిలో పెరగకుండా, తగ్గకుండా ఊగిసలాడుతున్నాయి. అయితే ఇది కాస్త ఊరటనిచ్చే అంశమనే చెప్పుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
యుద్ధం ముగిసేదెప్పుడు?
Image Credit : our own

యుద్ధం ముగిసేదెప్పుడు?

అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ....ఇప్పుడే ముగిసే ఆనవాలు కనిపించడం లేదు. 2-3 వారాల్లో ముగిస్తామని ట్రంప్ చెబుతున్నారు గానీ.. డీల్ గడువు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో యుద్ధం ముగిసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్లతో విరుచుకుపడుతోంది. ట్రంప్ తీరు చూసి ప్రపంచ దేశాలు సైతం నవ్వుకుంటున్నాయి. ఎందుకంటే డీల్ కోసం డెడ్ లైన్ పెట్టడం, మళ్లీ పొడిగించడం మామూలైపోయింది. మార్చి నుంచి ఇప్పటివరకూ 5 సార్లు అలానే చేశారు. హర్మూజ్ తెరవకపోతే విధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మళ్లీ ఆ తర్వాతే గడువు పొడిగించడం మామూలైపోయింది. ఇక ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటంతో...బంగారం రేట్లు అనిశ్చితంగా ఉంటున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియక ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు. 

33
కుప్పకూలిన బంగారం ధరలు
Image Credit : Getty

కుప్పకూలిన బంగారం ధరలు

ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలతో మళ్లీ బంగారం ధరలు కుప్పకూలిపోయాయి. హైదరాబాద్ లో ఇవాళ బంగారం రేట్లు చూసుకుంటే 24 క్యారెట్లకు 10 గ్రాములపై రూ.1800 తగ్గి రూ.1,49,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములపై 1650 రూపాయలు పతనమై రూ.1,36,700 వద్ద ఆగింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. కేజీ వెండి రేటు రూ.2.55 లక్షల వద్ద స్థిరపడింది. మార్కెట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి...గమనించుకుని కొనడం, పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Today Gold Rate: బంగారం ధరలకు రెక్కలు..ఇప్పుడు కొనడం మంచిదేనా?
Recommended image2
Today Gold Rate: కొనుగోలుదారుల కొంపముంచిన బంగారం..ట్రంప్ టెంపరితనంతో గందరగోళంలో మార్కెట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved