MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Silver Price Crash: దివాళి ధమాకా.. 4 రోజుల్లోనే వెండి రూ. 16,000 క్రాష్.. గోల్డ్ ఎంతకు పడిపోయిందో తెలుసా?

Gold Silver Price Crash: దివాళి ధమాకా.. 4 రోజుల్లోనే వెండి రూ. 16,000 క్రాష్.. గోల్డ్ ఎంతకు పడిపోయిందో తెలుసా?

Gold Silver Price Crash: ధన్‌తేరస్, దీపావళికి ముందే బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. నాలుగు రోజుల్లోనే కేజీ వెండి రూ. 16,000 తగ్గగా, బంగారం ధర కూడా భారీగా తగ్గింది. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 25 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రాష్ అయిన బంగారం, వెండి ధరలు
Image Credit : Chatgpt

క్రాష్ అయిన బంగారం, వెండి ధరలు

దీపావళి, ధన్‌తేరస్ పండుగలు దగ్గరపడుతున్న వేళ బంగారం, వెండి ప్రియులకు మార్కెట్ నుంచి ఊరట కలిగించే వార్త అందింది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెండి ధర భారీగా కుప్పకూలింది. మన దేశీయ మార్కెట్లలోనే కాకుండా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో కూడా ఈ విలువైన లోహాల రేట్లు తీవ్రమైన ఒత్తిడికి గురై పడిపోయాయి. పండుగ షాపింగ్ చేసుకునే సామాన్యులకు ఇది ఊరటనిచ్చే అంశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
4 రోజుల్లోనే రూ. 16,000 కుప్పకూలిన వెండి ధర
Image Credit : Asianet News

4 రోజుల్లోనే రూ. 16,000 కుప్పకూలిన వెండి ధర

ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) సమాచారం ప్రకారం, దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. అక్టోబర్ 16న కిలో వెండి ధర రూ. 2,10,918 వద్ద ముగియగా, శుక్రవారం నాటికి అది రూ. 1,94,415 కి చేరింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కిలో వెండిపై ఏకంగా రూ. 16,503 తగ్గింది. దీంతో చాలా కాలం తర్వాత వెండి ధర మళ్లీ రూ. 2 లక్షల దిగువకు పడిపోయింది.

ఇక ఫ్యూచర్స్ మార్కెట్ (MCX) విషయానికి వస్తే, డిసెంబర్ 4 ఎక్స్‌పైరీతో కూడిన వెండి కాంట్రాక్ట్ రూ. 2,11,187 నుంచి రూ. 1,96,100 కి పడిపోయింది. అంటే MCX లో కూడా నాలుగు రోజుల్లో రూ. 15,087 తగ్గింది. జనవరి చివరి వారంలో నమోదైన ఆల్ టైమ్ హై రేట్ రూ. 4,20,048 తో పోలిస్తే, ప్రస్తుతం వెండి ఏకంగా రూ. 2,23,948 తగ్గడం గమనార్హం.

35
బంగారం ధరల పై ఒత్తిడి
Image Credit : Getty

బంగారం ధరల పై ఒత్తిడి

వెండి బాటలోనే బంగారం ధరలు కూడా పడిపోతున్నాయి. MCX లో డిసెంబర్ 4 ఎక్స్‌పైరీ కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,918 నుంచి రూ. 5,768 తగ్గి రూ. 1,42,150 వద్దకు చేరింది. దేశీయ మార్కెట్‌లో IBJA గణాంకాల ప్రకారం, 10 గ్రాముల బంగారంపై రూ. 4,796 తగ్గి, రూ. 1,46,426 నుంచి రూ. 1,41,630 కి పడిపోయింది.

వివిధ క్వాలిటీల బంగారం ధరలు ఇలా ఉన్నాయి (10 గ్రాములకు):

• 24 క్యారెట్ల బంగారం: రూ. 1,41,630

• 22 క్యారెట్ల బంగారం: రూ. 1,38,230

• 20 క్యారెట్ల బంగారం: రూ. 1,26,050

• 18 క్యారెట్ల బంగారం: రూ. 1,14,720

• 14 క్యారెట్ల బంగారం: రూ. 91,350

45
అంతర్జాతీయంగా ఎందుకు బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి?
Image Credit : Getty

అంతర్జాతీయంగా ఎందుకు బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి?

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంచుతుందనే సంకేతాలు బంగారం, వెండి పతనానికి కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ 3,989.10 డాలర్ల కనిష్ఠానికి పడిపోయి, తర్వాత 4,026 డాలర్ల వద్ద రికవర్ అయింది.

వెండి అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఒకానొక దశలో ఔన్సుకు 53.8 డాలర్ల ఆల్ టైమ్ లోకి పడిపోయింది. కొటాక్ నియో ప్రతినిధి కైనాత్ చైన్‌వాలా ప్రకారం, పారిశ్రామిక వినియోగం ఎక్కువగా ఉండే వెండిపై మార్కెట్ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్పాట్ మార్కెట్‌లో వెండి 50 డాలర్ల దిగువకు పడిపోతే, మన మార్కెట్‌లో కిలో వెండి రూ. 1.90 లక్షల కంటే కిందకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

55
ఆభరణాలు కొనేవారు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Image Credit : Getty

ఆభరణాలు కొనేవారు ఈ విషయాలు గుర్తుంచుకోండి

మీరు పండుగ సందర్భంగా లేదా వివాహాల కోసం జ్యువెలరీ షాపులకు వెళ్లి బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పైన పేర్కొన్న IBJA దరలు కేవలం ప్యూర్ మెటల్ రేట్లు మాత్రమే. మీరు నగల రూపంలో కొనుగోలు చేసేటప్పుడు ఆయా రాష్ట్రాలు లేదా నగరాలను బట్టి వర్తించే జీఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. దీనివల్ల నికర ధర కొంత పెరుగుతుంది.

గమనిక: బంగారం, వెండి లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఈ వివరాలు కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బంగారం
వ్యాపారం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ticket Booking: ట్రైన్ టికెట్ ఎలా తీస్తే త్వరగా కన్ఫర్మ్ అవుతుంది?
Recommended image2
LIC: ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం అకౌంట్‌లోకి డబ్బులు
Recommended image3
Gold Silver Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి...రూ.2లక్షలకు పడిపోతున్న వెండి
Related Stories
Recommended image1
Kokapet Real Estate: ఒకప్పుడు రాళ్ల గుట్టలు.. ఇప్పుడు ఎకరం వందల కోట్లు... కోకాపేటకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
Recommended image2
LIC: ఎల్ఐసీ అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లు కడితే చాలు జీవితాంతం అకౌంట్‌లోకి డబ్బులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved