బంగారాన్ని అమ్మేయాలా.? గోల్డ్ లోన్ తీసుకోవాలా.? రెండింటిలో బెస్ట్ ఆప్షన్ ఏదంటే..
Gold: బంగారం అంటే అదో ఎమోషన్. మరీ ముఖ్యంగా భారతీయులను బంగారాన్ని వేరు చేసి చూడలేం. ఇంట్లో బంగారం ఉంటే గుండె మీద చేయి వేసుకొని ఉంటాయి మధ్య తరగతి కుటుంబాలు. అయితే డబ్బు అవసరపడ్డప్పుడు బంగారాన్ని అమ్మాలా, లోన్ తీసుకోవాలా ఇప్పుడు చూద్దాం.

బంగారానికి ఉండే విలువే వేరు
భారతీయ కుటుంబాల్లో బంగారానికి ఎంతో విలువ ఉంటుంది. కేవలం అలంకారానికి కాకుండే బంగారాన్ని ఆర్థిక భద్రతకు సూచికగా భావిస్తుంటారు. బోనస్, లాభం ఇలా కాస్త డబ్బు మిగిలితే కొంత బంగారం కొని పెట్టుకుందామన్న ఆలోచనతో ఉంటారు. ఇక డబ్బు అవసరపడితే బంగారాన్ని అమ్మొచ్చు లేదా లోన్ కూడా తీసుకోవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో ఇప్పుడు తెలుసుకుందాం.
గోల్డ్ లోన్ తీసుకుంటే..
బ్యాంకులు లేదా ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలు మీ దగ్గర ఉన్న నగల నాణ్యతను, బరువును చెక్ చేసి వాటికి అనుగుణంగా ఇస్తుంటారు. కేవలం గంటల్లోనే లోన్ పొందొచ్చు. సాధారణంగా గోల్డ్ లోన్స్‌కి వడ్డీ 8% నుంచి 12.5% మధ్య ఉంటాయి. మీ బంగారం సేఫ్టీగా ఉంటూనే రుణం పొందొచ్చు. అయితే సమయానికి రుణాన్ని చెల్లించకపోతే మీ గోల్డ్‌ను వేలం వేస్తారు.
బంగారాన్ని అమ్మితే..
అప్పటికే అప్పులు ఉండి కొత్తగా రుణం వద్దు అనుకునే వారు బంగారన్ని అమ్మొచ్చు. బంగారాన్ని విక్రయిస్తే వెంటనే డబ్బులు వస్తాయి. అలాగే ఎలాంటి రుణ భారం కూడా ఉండదు. అయితే జ్యువెలర్లు మార్కెట్ రేట్ల కంటే 10–15% తక్కువ చెల్లిస్తారు. అప్పులు తీరాక, భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక, తిరిగి కొనుగోలు చేస్తామనుకునే వారు బంగారాన్ని అమ్మేయడమే మంచిది.
ఏది ఎప్పుడు చేయాలి
బంగారానికి భవిష్యత్తులో ధర పెరుగుతందని భావించినా, ఇది కుటుంబ సంపద దానిని అమ్మకూడదనే ఆలోచన ఉన్నవారు గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిది. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్న వార లేదా బంగారం అమ్మిన సొమ్ముతో వేరే పెట్టుబడి పెట్టేవారు (ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు) వంటివి చేసే వారు బంగారాన్ని అమ్మేయడం ఉత్తమం.
నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి
* వడ్డీ రేట్లు, లోన్ కాలపరిమితి.
* వ్యక్తిగత నగదు అవసరాలు.
* భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు.
* బంగారంతో మీకు ఉన్న భావోద్వేగాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం మీద బంగారాన్ని అమ్మాలా లేదా గోల్డ్ లోన్ తీసుకోవాలా అనేది మీ అవసరాలు, పరిస్థితి, భవిష్యత్తు లక్ష్యాలను బట్టి నిర్ణయించుకోవాలి.