నెలకు రూ. 10 వేలు పక్కన పెడితే.. రూ. 7 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు
Post Office: భవిష్యత్తు కోసం సేవింగ్స్ అనేది తప్పనిసరి. కానీ పెట్టుబడిలో రిస్క్ తక్కువగా ఉండి, గ్యారంటీ రాబడి ఇచ్చే ఆప్షన్ ఏదైనా ఉందా అని చాలామంది ఆలోచిస్తారు. ఇలాంటి వాటిలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

చిన్న మొత్తంతో పెద్ద లక్ష్యం
ఈ పథకంలో మీరు కేవలం రూ.100తోనే ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూ మీరు స్థిరంగా పొదుపు చేయవచ్చు. సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి ఇది సులభమైన పెట్టుబడి మార్గంగా చెప్పొచ్చు.
నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
ప్రస్తుతం పోస్టాఫీస్ RD పథకానికి సుమారు 7.4% వార్షిక వడ్డీ అందుతోంది. మీరు ప్రతి నెలా రూ.10,000 డిపాజిట్ చేస్తే, 5 ఏళ్ల (60 నెలల)లో మొత్తం రూ. 6,00,000 మీరు డిపాజిట్ చేస్తారు. వడ్డీతో కలిపి రూ. 7.15 లక్షల వరకు రాబడి వస్తుంది. అంటే 5 ఏళ్లలో రూ. 1.15 లక్షల అదనపు ఆదాయం లభిస్తుంది.
ప్రభుత్వ భద్రతతో పెట్టుబడి
పోస్ట్ ఆఫీస్ RD పథకం పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి మీ పెట్టుబడికి 100% భద్రత ఉంటుంది. మార్కెట్‌లో జరిగే హెచ్చుతగ్గులు దీని మీద ప్రభావం చూపవు. ఈ కారణంగా రిటైర్డ్ వ్యక్తులు, గృహిణీలు, సేవింగ్స్ మైండ్‌సెట్ ఉన్న వారికి ఇది అత్యుత్తమమైన ఆప్షన్‌గా ఉంటుంది.
రుణ సౌకర్యం, పన్ను ప్రయోజనం
ఈ పథకంలో ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మీ డిపాజిట్ మొత్తంలో 50% వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే, అవసరమైన సమయంలో డబ్బు కోసం ఖాతాను మూసివేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అదనంగా ఈ పెట్టుబడిపై Income Tax Act సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఎవరికి ఉపయోగపడుతుంది.?
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ చిన్న మొత్తాలతో సేవింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ సరిపోతుంది. ముఖ్యంగా నెలవారీ ఆదాయం ఉన్న వారు, రిస్క్ తీసుకోలేని వారు, పిల్లల భవిష్యత్తు కోసం సేవ్ చేయాలనుకునే కుటుంబాలకు ఇది మంచి పెట్టుబడి మార్గంగా చెప్పొచ్చు.