MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price: పసిడి ప్రియులకు ఊరట..దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా దిగొస్తున్న బంగారం

Gold Price: పసిడి ప్రియులకు ఊరట..దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా దిగొస్తున్న బంగారం

Gold Price: దసరా షాపింగ్‌కు రెడీ అవుతున్నారా? బంగారం కొనాలనుకుంటున్నారా? వరుసగా కదిలిన గోల్డ్ రేట్లకు ఇప్పుడు కాస్త బ్రేక్ పడింది. మరి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎంతున్నాయి? ఈ ధరలు కొనుగోలుదారులకు అనుకూలమేనా? చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 08 2026, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాతాళంలోనే పసిడి
Image Credit : Asianet News

పాతాళంలోనే పసిడి

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవాళ్టి మార్కెట్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. గత కొంతకాలంగా భారీగా కదిలిన పసిడి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో పండుగ సీజన్‌లో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మార్కెట్‌ను గమనించేందుకు మరో అవకాశం లభించింది. అక్టోబర్ 8, 2026న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లోనూ దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,49,570 వద్ద బంగారం ధర
Image Credit : Getty

రూ.1,49,570 వద్ద బంగారం ధర

ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.14,957గా ఉంది. అంటే 10 గ్రాముల పసిడి కొనాలంటే రూ.1,49,570 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.13,710గా పలుకుతోంది. 10 గ్రాములకు దీని ధర రూ.1,37,100గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. గ్రాము రూ.11,218గా నమోదైంది. 10 గ్రాముల ధర రూ.1,12,180 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ ఇదే ధరలు ఉన్నాయి.

34
గత కొన్ని రోజులుగా స్థిరంగా వెండి
Image Credit : X

గత కొన్ని రోజులుగా స్థిరంగా వెండి

ఇటీవల బంగారం, వెండి ధరల్లో కనిపించిన వేగం కొంత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు, పెట్టుబడిదారుల వైఖరిలో మార్పులు వంటి అంశాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే.. అక్టోబర్ 8న తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లోనూ ఇదే రేట్లు ఉన్నాయి.

44
బిల్లు చెక్ చేయాలి
Image Credit : Getty

బిల్లు చెక్ చేయాలి

మొత్తంగా చూస్తే.. పసిడి, వెండి ధరల్లో ఇవాళ పెద్దగా కదలిక లేకపోవడంతో కొనుగోలుదారులకు మార్కెట్‌ను అంచనా వేసే అవకాశం దొరికింది. ముఖ్యంగా దసరా, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు రోజువారీ ధరలను గమనించడం మంచిది. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. మార్కెట్‌లో చెప్పే బంగారం ధరకు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కలవొచ్చు. కాబట్టి నగలు కొనేటప్పుడు కేవలం పసిడి రేటును మాత్రమే కాకుండా.. మొత్తం బిల్లును పరిశీలించడం ముఖ్యం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Online Shopping Tricks: నెలకు రూ.5,000 వరకూ ఆదా చేసే సూపర్ ఫార్ములా..
Recommended image2
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారికి పండ‌గే.. ఆర్బీఐ రెపో రేటుతో ఎంత వ‌డ్డీ పెర‌గ‌నుందంటే?
Recommended image3
EPFO: ఈపీఎఫ్ కొత్త రూల్స్.. పెరిగిన పరిమితి.. 51 లక్షల మందికి జాక్‌పాట్
Related Stories
Recommended image1
Gold Price Fall: దసరా వేళ బంగారం భారీ పతనం...పసిడి ప్రియులకు పండగే పండగ
Recommended image2
Today Gold Price: తులం బంగారం మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? ఇప్పుడు కొనడం లాభమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved