MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Price: తులం బంగారం మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? ఇప్పుడు కొనడం లాభమేనా?

Today Gold Price: తులం బంగారం మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? ఇప్పుడు కొనడం లాభమేనా?

Today Gold Price: బంగారం కొనాలనుకునేవారికి ముఖ్యమైన అప్ డేట్. కొంతకాలంగా భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. దీంతో బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? లేక మళ్లీ పెరుగుతుందా? అనే చర్చ మొదలైంది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 05 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా?
Image Credit : X

బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా?

ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఔన్సు పసిడి ఏకంగా 5,595 డాలర్ల వరకు వెళ్లింది. ఆ తర్వాత మాత్రం ధరల్లో క్రమంగా దిద్దుబాటు కనిపించింది. ప్రస్తుతం ఔన్సు బంగారం సుమారు 4,130 డాలర్ల వద్ద ఉంది. అంటే జనవరి గరిష్ట స్థాయితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి దాదాపు 26 శాతం తగ్గింది. దేశీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మన దగ్గర గరిష్ట స్థాయి నుంచి బంగారం ధర సుమారు 23 శాతం క్షీణించింది. అయితే ఈ ఏడాది ఆగస్టులో పసిడి మరోసారి భారీగా పెరిగింది. తులం బంగారం ధర రూ.1,64,773 వరకు వెళ్లింది. ఆ తర్వాత మాత్రం వరుసగా తగ్గుతూ వచ్చింది. గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,990 స్థాయికి చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇంతకీ బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
Image Credit : Getty

ఇంతకీ బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

పసిడి భారీగా పెరిగిన సమయంలో పెట్టుబడిదారులు లాభాలను తీసుకునేందుకు అమ్మకాలకు దిగారు. దీంతో మార్కెట్లో విక్రయ ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ముడిచమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక దశలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు చేరింది. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న అంచనాలు కూడా బంగారంపై ఒత్తిడిని పెంచాయి.

33
తులం బంగారం మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా?
Image Credit : Getty

తులం బంగారం మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా?

మరోవైపు బంగారం ధరలు మరో 25 శాతం తగ్గితే, భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర సుమారు రూ.1,34,000 స్థాయికి రావచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే చాలామంది ఎదురుచూస్తున్న ఒక ప్రశ్న మాత్రం.. తులం బంగారం మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? అలా జరగాలంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సుమారు 2,800 డాలర్లకు పడిపోవాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారీగా ధర తగ్గడం దాదాపు అసంభవమని చెబుతున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, ఇక ఎప్పటికీ తగ్గుతూనే ఉంటాయని చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. ఇవన్నీ పసిడి తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Recommended image2
పండుగ సీజన్ ఆఫర్... ఆ కార్లపై లక్ష రూపాయలకు పైగా భారీ డిస్కౌంట్, ఇప్పుడే కొనేయండి
Recommended image3
RBI: మీరు చెల్లించే EMI పెరిగే అవ‌కాశం.. ఆర్బీఐ మ‌ళ్లీ రెపోరేటు పెంచుతుందా.?
Related Stories
Recommended image1
Gold Price Fall: దసరా వేళ బంగారం భారీ పతనం...పసిడి ప్రియులకు పండగే పండగ
Recommended image2
Gold Price Hike: బంగారం ధరలకు రెక్కలు.. 10 గ్రాములపై ఏకంగా రూ.1,040 పెరుగుదల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved