MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Gold Price Hike: ఆగస్టులో ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. కొద్దిరేజులుగా బేజారెత్తిపోతున్న కొనుగోలుదారులు

Gold Price Hike: ఆగస్టులో ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. కొద్దిరేజులుగా బేజారెత్తిపోతున్న కొనుగోలుదారులు

Gold Price Hike: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా పసిడి రేట్లు ఎగబాకడంతో నగలు కొనాలని భావిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో భారీగా తగ్గిన ధరలు... ఆగస్టు ప్రారంభం నుంచే మళ్లీ పెరుగుదల బాట పట్టాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 07 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెరుగుదల బాట పట్టిన పసిడి
Image Credit : Getty

పెరుగుదల బాట పట్టిన పసిడి

ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,49,890కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.150 పెరిగి రూ.1,37,400 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలు కూడా పెరుగుదలనే నమోదు చేశాయి. కిలో వెండి రూ.2.50లక్షలకు చేరిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు
Image Credit : Getty to Asianet

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు

అయితే ఈ పెరుగుదలకు కేవలం దేశీయ డిమాండ్ మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య కీలక సమావేశంలో ఆయుధాల నిల్వల అంశంపై తీవ్ర చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో క్షిపణుల నిల్వలు తగ్గుతున్న విషయంపై అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ కథనాలు పేర్కొన్నాయి.

Related Articles

Related image1
Gold Price Hike: హర్మూజ్ సంక్షోభం ప్రభావం..రూ.1.50 లక్షల దిశగా బంగారం ధరలు
Related image2
Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి
34
పెట్టుబడిదారుల్లో యుద్ధ భయం
Image Credit : chatgpt

పెట్టుబడిదారుల్లో యుద్ధ భయం

ఈ యుద్ధంలో ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లను పెద్దఎత్తున వినియోగిస్తుండగా... వాటిని అడ్డుకునేందుకు అమెరికా అత్యంత ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఉపయోగించాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పేట్రియట్, థాడ్ వంటి రక్షణ వ్యవస్థల వినియోగం గణనీయంగా పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వార్తలను అమెరికా ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ట్రంప్‌కు రక్షణ మంత్రిపై పూర్తి విశ్వాసం ఉందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అలాగే పెంటగాన్ కూడా ఆయుధాల కొరతపై వస్తున్న కథనాలను నిజం కాదని తెలిపింది.

అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి. యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉందనే భయంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతోంది. అదే ప్రభావం దేశీయ మార్కెట్లో కూడా కనిపిస్తోంది.

44
మార్కెట్లు గమనించాలి
Image Credit : Getty

మార్కెట్లు గమనించాలి

అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరలు మరికొంత కాలం బలంగానే ఉండే అవకాశం ఉంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినా లేదా శాంతి చర్చల్లో పురోగతి కనిపించినా ధరల్లో కొంత ఉపశమనం రావచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు అంతర్జాతీయ పరిణామాలతో పాటు రోజువారీ ధరలను కూడా గమనించడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Gold Price Hike: హర్మూజ్ సంక్షోభం ప్రభావం..రూ.1.50 లక్షల దిశగా బంగారం ధరలు
Recommended image2
Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved