MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Gold Rate: ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం, వెండి కూడా అదే బాట..!

Gold Rate: ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం, వెండి కూడా అదే బాట..!

ఇప్పటికే బంగారం ధర రూ.లక్షకు చేరువలో ఉంది. మరి కొద్దిరోజుల్లో అది రూ.1.25 లక్షల దాకా కూడా వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సామాన్యుల బంగారం కొనాలనే కోరిక ఎప్పటికీ కోరికగానే మిగిలిపోతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 21 2025, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


ప్రపంచ ఆర్థిక అస్థిరత కారణంగా భారతదేశంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్షయ తృతీయ దగ్గరపడుతోంది. ఈ సమయంలో కనీసం గ్రాము బంగారం అయినా కొనాలని చాలా మంది భారతీయులు అనుకుంటూ ఉంటారు. కానీ, వారి ఆశలకు బంగారం ధర కల్లెం వేస్తోంది. రోజు రోజుకీ ధర ఆకాశాన్ని అంటుంది. తాజాగా ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. మరి, ఇప్పుడు ధర ఎంత పెరిగింది..? ఎంతకు చేరుకునే అవకాశం ఉంది అనే విషయాలు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పటికే బంగారం ధర రూ.లక్షకు చేరువలో ఉంది. మరి కొద్దిరోజుల్లో అది రూ.1.25 లక్షల దాకా కూడా వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సామాన్యుల బంగారం కొనాలనే కోరిక ఎప్పటికీ కోరికగానే మిగిలిపోతుంది.

35

బంగారం ధర పెరుగుదలకు కారణం

గత ఐదు సంవత్సరాల్లో, బంగారం ధర 110% కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఏప్రిల్ 2020లో 10 గ్రాములకు రూ.44,906గా ఉండగా, ఏప్రిల్ 2025లో రూ.95,239కి చేరుకుంది. వాణిజ్య వివాదాలు,అమెరికా మాంద్యం ముప్పు వంటి అనేక ప్రపంచ ఆర్థిక కారకాల వల్ల ఈ ధర పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
 

45
Gold Shop

Gold Shop

నిరంతరం పెరుగుతున్న బంగారం ధర

అంతర్జాతీయ బంగారం ధర ఔన్స్‌కు $3,700కి చేరుకుంటుందని, వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే $4,500కి చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ఈ ప్రపంచ ధోరణి భారతదేశంలో దేశీయ బంగారం ధరను రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది.

55
Gold

Gold


నేడు హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి తొలిసారిగా రూ.90,150 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.770 పెరిగి రూ.98,350 వద్ద కొనసాగుతోంది. ఇక..  బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతోంది. కేజీ వెండి రూ.1000 పెరగడంతో రూ.1,11,000 కి చేరుకుంది.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం
పర్సనల్ పైనాన్స్
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved