Gold Rate: బంగారం ధర భారీగా తగ్గింది..ఏకంగా 11,000 రూపాయలు పతనం...శ్రావణ మాసంలో పండగే..
బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి ఈ నేపథ్యంలో రాబోయే శ్రావణమాసంలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గిస్తున్నాయి దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బంగారం ధరలు గురువారం కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బంగారం ధర భారీగా తగ్గడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికా బాండ్ మార్కెట్లో బాండ్ యీల్డ్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. దీంతో మధుపరులు ఎక్కువగా బాండ్ల మీదనే పెట్టుబడి పెడుతున్నారు.
దీంతో బంగారం ధరలో దేశీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా అమెరికా మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్స్ 31 గ్రాములు ధర ప్రస్తుతం 1919 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత మూడు నెలలుగా గమనించినట్లయితే బంగారం ధర భారీగా పతనం అవుతోంది. 2023 మే నెలలో బంగారం ధర 2049 డాలర్ల వద్ద రికార్డు స్థాయిని తాకింది. అక్కడి నుంచి నెమ్మదిగా పతనం అవుతూ బంగారం ధర ప్రస్తుతం ఆగస్టు నెలలో 1920 డాలర్లు పతనమైంది. ఈ లెక్కన గమనించినట్లయితే దాదాపు 130 డాలర్లు బంగారం ధర తగ్గినట్లు కనిపిస్తోంది. అంటే గరిష్ట స్థాయిని దాదాపు 11 వేల రూపాయలు తగ్గింది.
ఇక దేశీయంగా గమనించినట్లయితే కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. మే నెలలో దేశీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు 63 వేల రూపాయల వరకు పసిడి ధరలు పెరిగాయి. అక్కడి నుంచి బంగారం ధర నెమ్మదిగా పతనం అవుతూ ప్రస్తుతం 60 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా అమెరికా డాలర్ రోజురోజుకీ బలం పుంజుకుంటుంది. ఫలితంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరకు డాలర్ బలానికి సంబంధం ఉంది. డాలర్ బలం పెరిగే కొద్దీ అమెరికా బాండ్ విలువ పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం కన్నా కూడా అమెరికన్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. తద్వారా వారు ఎక్కువ ఆదాయం పొందేందుకు వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు బహిరంగ మార్కెట్లో తగ్గుముఖం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రాబోయే శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం పుష్కలంగా ఉన్నట్లు పసిడి మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ట్రెండు కనుక కొనసాగితే ప్రస్తుతం ఉన్న ధర నుంచి బంగారం ధర దాదాపు మరో 5 వేల రూపాయల వరకు తగ్గే వీలుందని చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధర అతి త్వరలోనే ఔన్స్ బంగారం ధర 1900 డాలర్ల కన్నా తక్కువకు దిగిపోయే అవకాశం ఉంది.
భవిష్యత్తులో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు మరింత పెంచవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక రాబోయే ఫెస్టివల్ సీజన్లో బంగారం ధర తగ్గినట్లయితే ఆభరణాల మార్కెట్ కూడా పుంజుకుంటుందని బంగారం విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.