MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Fall: పసిడి ప్రియులకు పండగే.. బంగారం ధరలు తగ్గుముఖం..తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేట్లు ఇవే

Gold Price Fall: పసిడి ప్రియులకు పండగే.. బంగారం ధరలు తగ్గుముఖం..తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేట్లు ఇవే

Gold Price Fall: బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్న భారీగా పెరిగిన పసిడి.. ఇవాళ దిగొచ్చింది. 10 గ్రాముల బంగారంపై రూ.160 వరకు తగ్గింది. మరి ఈ తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా? లేక రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా? అసలు మార్కెట్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది?

2 Min read
Author : Nandini Arava
Published : Sep 26 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడికి బ్రేక్
Image Credit : Getty

పసిడికి బ్రేక్

బంగారం ధరలు వరుసగా మార్పులకు లోనవుతున్న వేళ.. శనివారం పసిడి రేట్లు స్వల్పంగా దిగొచ్చాయి. శుక్రవారం పెరిగిన ధరలకు నేడు బ్రేక్ పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.160, 22 క్యారెట్లపై రూ.150 చొప్పున తగ్గింది. దీంతో బంగారం కొనాలని చూస్తున్న వారికి కాస్త ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ఇతర ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో కిలో వెండి రూ.2.45 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ధరల్లో ఊగిసలాట
Image Credit : Getty

ధరల్లో ఊగిసలాట

అయితే బంగారం ధరల్లో ఈ స్వల్ప తగ్గుదల వెనుక దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇటీవలి కాలంలో కమోడిటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల కదలికలు పెరగడంతో ధరల్లో ఊగిసలాట కనిపిస్తోంది. భారీ కొనుగోళ్లు, అమ్మకాల మధ్య పసిడి రేట్లు ఒకరోజు పెరిగితే మరోరోజు తగ్గుతున్న పరిస్థితి నెలకొంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం సుమారు 4,285 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఆసక్తి కొనసాగుతోంది.

34
అమ్మకాల ఒత్తిడి
Image Credit : Getty

అమ్మకాల ఒత్తిడి

ఇటీవల దేశీయ, అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా బంగారం ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ధరలు కొంతమేర తగ్గిన తర్వాత ప్రస్తుతం మార్కెట్‌లో స్థిరీకరణ దశకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి.

44
ఇక్కడితో ఆగుతుందా?
Image Credit : Getty

ఇక్కడితో ఆగుతుందా?

అయితే ప్రస్తుత తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా? లేక రానున్న రోజుల్లో మరింత తగ్గుతుందా? అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అంతర్జాతీయ పరిణామాలు, పెట్టుబడిదారుల కదలికలు, మార్కెట్‌లో కొనుగోళ్లు, అమ్మకాలపై ఆధారపడి పసిడి ధరల్లో మళ్లీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు తాజా మార్కెట్ రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జియో ఐపీఓలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ట్రిక్’
Recommended image2
NSE: రూ. 4.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
Recommended image3
PPF Investment: నెలకు రూ. 1900 సేవ్ చేస్తే 1 కోటి వస్తుందా? పీపీఎఫ్ మ్యాజిక్ ఇది !
Related Stories
Recommended image1
Now Playing
Gold Price Today : నిన్న ఊరట.. ఇవాళ మళ్లీ షాకిచ్చిన పసిడి.. బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? మళ్లీ పెరిగిన పసిడి ధరలు..హైదరాబాద్ లో రేట్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved